Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అమ్మానాన్నలే నాకు మంచి స్నేహితులు

మా అమ్మానాన్నలే నాకు మంచి స్నేహితులు
, శనివారం, 4 ఆగస్టు 2007 (18:55 IST)
WD PhotoWD
మన గురించి ఇతరులకు తెలియాలంటే ముందుగా మన పేరు చెప్పి ఆ తర్వాత మాట్లాడటం సహజం. ఆ పరిచయం ఊరూపేరులేని వారితో కావచ్చు లేదంటే సుదూర ప్రాంతాలనుంచి వచ్చినవారితో కావచ్చు. ఈ పరిచయమే కాస్త ఎక్కువయితే స్నేహంగా మారుతుంది. మనసులోని ఊసులను చెప్పే స్థాయికి చేరి మంచి స్నేహితునిగా గుర్తింపు పొందుతుంది.

స్నేహంలో ఉండే కిక్ అంతా ఇంతా కాదు. నీ స్నేహితుడు ఎవరో చెబితే నీవెలాంటి వాడివో చెప్పేస్తా... అని పెద్దలు అన్నారు. అలాగే మంచి స్నేహితుడిని కలిగి ఉండటం మంచి పుస్తకం చదివినంత అని ఓ పండితుడు అన్నాడు. ఇలా స్నేహం లేనిదే జీవితమే లేదు అన్న మాట... మంచి స్నేహితుని కలిగిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట. స్నేహితుల రోజు సందర్భంగా అందాల నటి ఆర్తీ అగర్వాల్ వెబ్‌దునియా తెలుగుతో చెప్పిన సంగతులు...

ప్ర: హలో ఆర్తీ... స్నేహితుల రోజు శుభాకాంక్షలు.... మీ చిన్ననాటి స్నేహం గురించి కాస్త చెపుతారా?
ఆర్తీ: నేను పెరిగిందంతా అమెరికాలోనే. అక్కడ విన్సీ, లోపేజ్ అని చాలామంది స్నేహితులున్నారు.

ప్ర: మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందా
ఆర్తీ: అంతగా ఏమీ లేవు

ప్ర: స్నేహితుల ద్వారా సహాయం పొందిన సందర్భం ఉందా
ఆర్తీ: ఇప్పటివరకూ అటువంటి సందర్భం రాలేదు

ప్ర: ఇప్పటికీ టచ్ లో ఉన్న స్నేహితులెవరైనా ఉన్నారా
ఆర్తీ: మేమంతా తరచూ ఛాటింగ్ ద్వారా కలుస్తుంటాం

ప్ర: మీరు సినీనటి అయిన తర్వాత మీ స్నేహితులు మీతో ఇదివరికటిలానే ప్రవర్తిస్తున్నారా
ఆర్తీ: సేమ్... నో ఛేంజ్.

ప్ర: ఫ్రెండ్‌షిప్‌కు నిర్వచనం చెప్పండి
ఆర్తీ: అమ్మానాన్నలు కూడా మనకు మంచి స్నేహితులే. నా మటుకు నాకు మా అమ్మానాన్నలే మంచి స్నేహితులు. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకసారి డిప్రెషన్ కు గురయితే మంచి చెడూ ఏమిటో తెలియజెప్పి నన్ను సరిదిద్దారు. ఐ లవ్ మై ఫాదర్ అండ్ మా.

Share this Story:

Follow Webdunia telugu