Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బృందావనంలో 16 రోజులు.. రంగపంచమి కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను?

హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

బృందావనంలో 16 రోజులు.. రంగపంచమి కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను?
, బుధవారం, 23 మార్చి 2016 (10:37 IST)
శ్రీకృష్ణుడి నివాసమైన బృందావనంలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకునే హోలీ పండుగ రోజున ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమకు కొనియాడుతారు. 
 
భగవంతుడైన కృష్ణుడు గోపిలకతో తన కుచేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశారని విశ్వాసం. హోలీకి ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. 
 
హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు. 
 
హోలిక అను రాక్షసి అనే రాక్షసి రోజుకు ఒక చంటిబిడ్డను తింటూ, ఒక గ్రామవాసులందరికి గర్భశోకాన్ని కలిగించేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసరి మనువడి వంతు వచ్చిందట. అది గమనించిన ఆ వృద్ధురాలు హోలిక రాక్షసి నుంచి మనుమడిని తప్పించుకునేందుకు, ఆ గ్రామస్తుల గర్భశోక బాధను నివారించుటకై ఆ మహిమాన్వితుడైన మహర్షిని వేడుకొంటుంది. 
 
అందుకు ఆ రుషి తల్లీ.. ఆ రాక్షసి ఒక శాపగ్రస్తురాలు, ఎవరైనా ఆ రాక్షసిని నోటికిరాని దుర్భాషలతో తిడితే దానికి వెంటనే ఆయుక్షీణమై మరణిస్తుందని చెబుతాడు. అందుకోసం గ్రామస్తులను పోగుచేసి ఆ విధంగా దుర్భాషలాడమని తరుణోపాయం చెప్పినాడు. దానితో ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో గ్రామంలోనికి వెళ్లి రుషి తరుణోపాయం గ్రామస్తులకు తరుణోపాయం చెబుతుంది. ఆ మరుసటి రోడు ఆ గ్రామస్తులందరిచేత ఆ ముదుసలి ఆ రాక్షసిని అనరాని మాటలనిపిస్తుంది. 
 
ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత హోలీ రాక్షసి కుప్పకూలి మరణిస్తుంది. దానితో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగు చేసి ఆ చితిమంటలో హోలీరాక్షసిని కాల్సివేచి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. నాటి నుంచే హోలం పండుగ వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా హోలి పండుగ రోజు పితృదేవతలను పూజల ద్వారా సంతృప్తిపరిచి, హోలికా భూమికి నమస్కరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu