Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపదలు రావడానికి ఫెంగ్‌షుయ్ సూత్రాలు

Advertiesment
సంపదలు రావడానికి ఫెంగ్‌షుయ్ సూత్రాలు
, శనివారం, 19 జులై 2008 (18:34 IST)
"కోటి విద్యలు కూటి కొరకే"నని పెద్దలన్న సామెత ఎప్పటికీ మరిచిపోలేము. దీనికోసమే మానవుడు ప్రతి రోజు ఎన్నో రీతుల్లో శ్రమిస్తుంటాడు. కూటి కొరకే ద్రవ్యాన్ని ఆర్జించడం కూడా ఇందులో ఓ భాగమైంది. మనిషికి స్వయం కృషి ఓ ఎత్తయితే, మరోవైపు శాస్త్రాలు పేర్కొంటున్న సూత్రాలు కూడా మరో ఎత్తు.

మనం నివసించేందుకు ఇంటిని నిర్మిస్తాం. అది శాస్త్ర ప్రకారం అమర్చుకోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు గృహంలో పాటించే కొన్ని సూత్రాలు కూడా మనిషికి పురోభి వృద్ధికి దోహదపడుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అన్నింటికి ప్రధానమైంది ధనమే. దీనిని సంపాదించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.

అయితే ఫెంగ్‌షూయ్ సంపద వెల్లువల్లా రావడానికి కొన్ని సూత్రాలనిస్తోంది. అవి ఏమిటో పరిశీలిద్దామా... ముందుగా ఇంటి ప్రధాన ద్వారపు నేలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ప్రాంతంలో చెత్తా చెదారం, పనికిరాని వస్తువులను తొలగించడం చాలా మంచిది. అదే విధంగా టాయ్‌లెట్ తలుపులను ఎప్పుడూ మూసి ఉంచండి.

డైనింగ్ రూమ్ మంచి సంపదకి, ఆహారానికి సంపదను సూచిస్తుంది కాబట్టి, డైనింగ్ రూమ్ ద్వారం నుంచి ప్రథమ ద్వారం వైపు మీ సంపద, డబ్బు తరలి వెళ్ళకుండా మీ డైనింగ్ గదికి తెరకట్టడం మంచిదని ఫెంగ్‌షూయ్ అంటోంది. ఆగ్నేయ మూలను సంపదకి చిహ్నంగా పేర్కొనడం ద్వారా, అక్కడ ధనాన్ని లేదా అకౌంట్ పుస్తకాలను ఉంచడం ద్వారా సంపద మీకు చేరువవుతుందని ఫెంగ్‌షూయ్ పేర్కొంటుంది.

Share this Story:

Follow Webdunia telugu