Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాస్తుతో దిశల భాగాల గుర్తింపు

Advertiesment
ఇల్లు స్థలం స్థలం మార్పులు దిశలు మీకు ప్రాంతాలు వస్తువులు పెట్టాలో మనకు కొంత వరకు తెలుసు ఐతే ఈ భాగాలను ఎలా గుర్తించాలి.
, శుక్రవారం, 4 ఏప్రియల్ 2008 (16:29 IST)
కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు స్థలాన్ని కొన్నారా ? అయితే ఆ స్థలంలో చేయాల్సిన మార్పులు, అమర్చవలసిన దిశలు మీకు తెలుసా ? ఏయే ప్రాంతాల్లో ఎలాంటి వస్తువులు పెట్టాలో మనకు కొంత వరకు తెలుసు ఐతే ఈ భాగాలను ఎలా గుర్తించాలి. ఏ ప్రాతిపదికన గుర్తించాలో చాలామందికి తెలియదు. వారి కోసమే కొన్ని సూచనలు

ముందుగా మీ స్థలంలోని ప్రతి దిశను తొమ్మిది భాగాలుగా విభజించుకోండి. తూర్పువైపున ఉండే తొమ్మిది భాగాలలో ఈశాన్యం వైపు ఉన్న రెండు భాగాలను తూర్పు-ఈశాన్యంగా గుర్తు చేసుకోవాలి. ఆలాగే ఆగ్నేయం దిశగా ఉన్న రెండు భాగాలను తూర్పు ఆగ్నేయంగా గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన ఐదు భాగాలను తూర్పు భాగాలుగా ఉంచుకోవాలి.

ఉత్తరం వైపు ఉండే స్థలాన్ని ఈశాన్యం వైపు నుండి రెండు భాగములుగా విభజించి ఉత్తర - ఈశాన్యంగాను గుర్తంచాలి. అలాగే వాయువ్యం వైపు ఉన్న రెండు భాగాలను ఉత్తర-వాయువ్యంగా గుర్తించాలి. మిగిలిన భాగాలను ఉత్తర భాగాలుగా గుర్తించాలి.

అలాగే పడమర వైపు ఉన్న స్థలంలో వాయువ్యం దిశగా ఉండే రెండు భాగాలను పడమర - వాయువ్యంగా గుర్తించాలి. నైరుతి వైపు ఉండే రెండు భాగాలను పడమర - నైరుతిగా గుర్తు పెట్టుకోవాలి. అన్ని భాగాలలాగానే ఇందులో కూడా మిగిలిన ఐదు భాగాలను పడమర భాగాలుగా గుర్తించాలి.

ఈ భాగాలకు సంబంధించి మరికొన్ని విషయాలను వచ్చేవారం చూద్దాం...

Share this Story:

Follow Webdunia telugu