మీరు చేస్తున్న వ్యాపారంలో విజయాన్ని సాధించాలని అనుకుంటున్నారా? అయితే మీకు ధైర్య, సాహసాలే కాకుండా కొన్ని నమ్మకాలు, అదృష్టాలు మీ వెంట ఉండాల్సిందే. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, చదువు రీత్యా విజయాలను సాధించేందుకు ఫెంగ్‌ష్యూయ్ ప్రకారం స్ఫటికలను ఎలా అమర్చుకోవాలో తెలుసుకుందాం.
మీ కార్యాలయంలోని మీ టేబుల్‌పై ఓ దీర్ఘచతురస్రాకారపు స్ఫటికను పెట్టడం ద్వారా విజయాలు మీ సొంతమవుతాయి. అలాగే మీరు విద్యార్థులైతే మీ స్టడీ టేబుల్‌పైనా స్పటికను ఉంచడం మంచిది. ఆఫీసు టెబుల్ మీదైతే దీనిని ఎడమ వైపుగా పెట్టవచ్చు. కావాలంటే దీనిని పేపర్ వెయిట్‌గా ఎడమ వైపు ఉంచి వాడుకోవచ్చు. తద్వారా ఇది అందంగా కూడా కనిపిస్తుంది.
భార్యాభర్తల మధ్య అనురాగం, ప్రేమ, బాంధవ్యాలు పెరిగేందుకు స్ఫటికలు దోహదపడతాయి. వీటిని నైరుతి వైపున ఉంచాలి. అయితే వీటిని ఉపయోగించే ముందు వీటిలో ఉండే ప్రతికూల శక్తులను పోగొట్టాలి. ఇందుకోసం వీటిని రాతిఉప్పు కరిగిన నీళ్లలో 24 గంటల సేపు ఉంచాలి. తర్వాత మూడు గంటల సేపు ఎండలో ఉంచాలి.
వీటిని సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ఉంచడం మంచిది. తద్వారా ఆ రశ్మి స్ఫటికంపై పడి మీ ఇల్లంతా కాంతి వలయాలతో నిండుతుంది. దీని ఫలితంగా ఇంట్లోని వారికి తెలివితేటలు అధికమయ్యే అవకాశం ఉంది. పిల్లలు బాగా చదవాలంటే, తెలివితేటలుగా ప్రవర్తించాలంటే వీటిని ఈశాన్యంలో వేలాడదీయడం మంచిది.