మనలో చాలామందికి పిల్లలు లేరని బాధ ఉంటుంది. తమతో పాటు పెళ్లి చేసుకున్నవారందరూ పిల్లల్ని కని సంతోషంగా ఉన్నారని తమకు మాత్రం పిల్లల భాగ్యం లేదని వీళ్లు తమలో తాము కుమిలిపోతుంటారు. అయితే ఫెంగ్‌ష్యూయ్ సూత్రాల ద్వారా పిల్లలు పుడతారని చైనీయుల నమ్మకం. మరి ఆ సూత్రాలను మీరు కూడా పాటించి చూడండి.
మీ గృహంలో ఏ మూలలోనైనా గోడలు ముందుకు పొడుచుకుని వచ్చాయేమో గమనించండి. అలాంటి వాటిని నిపుణుల సలహాతో సరిచేసుకోండి. అలాగే మీ ఇంటి సింహద్వారానికి బయటి వైపు నుంచి ఏవైనా దుష్ట శక్తులు పడేందుకు వీలుగా ఉందేమో చూసుకోండి. అంటే ఆ శక్తుల ప్రభావం మీ ఇంటిపై పడేటట్లు చెట్ల మొనలు ఉన్నాయేమో సరిగ్గా గమనించండి.
ఇలాంటి వాటిని మార్చడానికి ప్రయత్నించండి. కుదరకపోతే ఇల్లు మారడం మంచిది. అలానే మీ బెడ్‌కి దగ్గరగా చిన్నపిల్లల ఫోటోలు, అందమైన పెయింటింగ్స్‌లను పెట్టండి. మనసుకు ఆనందం ఉత్సాహం కలుగుతాయి. మీ బెడ్ ప్రతిఫలించేలా ఎదురుగా ఎటువంటి అద్దాలు, నీళ్ల వస్తువులు ఉంచకండి.