Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫెంగ్‌షూయ్‌తో డ్రెస్సింగ్ టేబుల్

Advertiesment
రూపాన్ని అద్దం ముఖం చూసుకుని అందానికి మెరుగులు దిద్దుకుంటూ డ్రెస్ చేసుకోవడమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. మన డ్రెస్సింగ్
, గురువారం, 3 ఏప్రియల్ 2008 (18:05 IST)
మన రూపాన్ని మనకు చూపేది అద్దం. అటువంటి అద్దంలో ముఖాన్ని చూసుకుని అందానికి మెరుగులు దిద్దుకుంటూ డ్రెస్ చేసుకోవడమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. మన డ్రెస్సింగ్, మేకప్ విషయాలలో మనం చాలా జాగ్రత్త వహిస్తాం. మరి అలానే డ్రెస్సింగ్ టేబుల్ అమర్చే విషయంలో కూడా కొన్ని ఫెంగ్‌షూయ్ నియమాలను పాటిస్తే మీకు అన్ని విధాలా శుభం జరుగుతుంది.

మీ డ్రెస్సింగ్ టేబుల్ అమర్చిన ప్రదేశంలో వెలుతురు బాగా ఉండేలా చూసుకోండి. కిటికీకి ఆనుకుని, లేదా లైటు వెలుగు బాగా ప్రసవించే వైపున మీ అద్దాన్ని అమర్చుకోండి. అంటే బయటి వెలుగు మీపైన పడాలన్న మాట. అప్పుడు మీ ముఖంలో ఎటువంటి మార్పులైనా స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాకుండా మీ ముఖం చాలా ప్రకాశవంతంగా కనిపించడంతో మీకు మేకప్ చేసుకునే ఉత్సాహం కూడా వస్తుంది.

చాలా మంది ఇళ్లల్లో మంచానికి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. మంచంపై పడుకుంటే మన కాళ్లు, మనము అద్దంలో కన్పిస్తుంటాము. ఇలా మీ ఇంట్లో ఉంటే వెంటనే ఆ భంగిమను మార్చండి. లేదంటే చెడు శక్తులు ఆవరించే ప్రమాదం ఉంది. అంతే కాకుండా నిద్రలో పీడ కలలు వచ్చి ఉలిక్కి పడి లేచినప్పుడు ఆందోళనలో చీకట్లో అద్దంలో కనిపించే మీ రూపాన్ని చూసుకుని భయపడే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అలా మార్చేందుకు వీలు లేకుంటే అద్దంలో మీరు కన్పించకుండా అద్దానికి కర్టెన్ వంటిది ఏదైనా వేసి కవర్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu