ఫెంగ్‌షుయ్ ప్రకారం పడకగది!
, శుక్రవారం, 11 జులై 2008 (18:36 IST)
వాస్తు ప్రకారం ఇంటి అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఎంతో
అవసరమని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది. దీని ప్రకారం ఇంట్లో ప్రధాన గదుల్లో ఎలాంటి నియమాలను పాటించాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అందులో భాగంగా పడకగదిలో మొక్కలను పెంచుకోవడం మంచిది కాదని ఆ శాస్త్రం వెల్లడిస్తోంది.
ఒకవేళ మొక్కలు పెంచుకోవాలని భావిస్తే వాటిని మంచానికి దూరంగా ఉండేలా చూసుకోండి. మంచాన్ని ఓ మూలగా కాకుండా గోడవైపు రెండు వైపులా అటూ ఇటూ తిరిగే వీలుండేలా ఏర్పాటు చేసుకోవడం మంచిది.
తలుపుకు ఎదురుగా మంచాన్ని ఉంచడం మంచిది కాదు. మరోవైపు పడకగదిలో టీవీ చూడటం చాలామందికి అలవాటు. వీటితో పాటు ఛాటింగ్, కంప్యూటర్ కసరత్తు వంటి సామగ్రిని ప్రతికూల శక్తికి కారణాలుగా పరిగణించడం ద్వారా, వీటిని పడకగదిలో లేకుండా చూసుకోవాలని ఫెంగ్‌షుయ్ అంటోంది.