గృహ నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించని పక్షంలో నూతన సమస్యలు ఏర్పడుతాయని చింతించనవసరం లేదు. గృహంలో మనం వాడే వస్తువులను ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం అమర్చుకుంటే సమస్యలను పోగొట్టుకోవచ్చు. వస్తువుల అమరికలో కొన్ని విధానాలు మీకోసం... ధనాన్ని భద్రపరచే స్థలాలుగా పేర్కొంటున్న నైరుతి దిశలో బీరువాలను అమర్చడం ఉత్తమమని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. బీరువాలను ఉత్తర దిశలో అమర్చాలి.
డాక్యుమెంట్స్, ఫైల్స్‌గల బీరువాలను వాయువ్య దిశలో అమర్చడం మంచిది. పడకగదిలో మంచాన్ని అమర్చేటప్పుడు దక్షిణదిశలో అమర్చుకోవడం ద్వారా శుభాలు కలుగుతాయి. హాలులో సోఫాలను నిర్మించేటప్పుడు తూర్పు- ఉత్తర దిశల్లో అమర్చాలి. పిల్లలు చదువుకోడానికి వీలుగా రీడింగ్ టేబుల్‌ను తూర్పు-ఉత్తరం దిశగా ఏర్పాటు చేయాలి.
హాలులో టీవీని తూర్పు-దక్షిణంలోనూ, ఏసీని కూడా ఇదే దిశలో అమర్చుకోవడం చేయొచ్చునని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కంప్యూటర్ అమరికను ఉత్తరం-పశ్చిమ దిశల్లో ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిని తూర్పుదిశగానే ఏర్పాటుచేసుకోవాలి. హాలులో ఆనందాన్ని వెలిబుచ్చే పటాలను ఏర్పాటు చేసుకుంటే ఆ గృహంలో సిరిసంపదలు నెలకొంటాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.