Publish Date: Fri, 09 Jan 2009 (11:06 IST)
Updated Date: Fri, 09 Jan 2009 (11:05 IST)
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అరకేజీ
ఎండుకొబ్బరి కోరు... ఒక కప్పు
ఖర్జూరం... వంద గ్రాములు
జీడిపప్పు... వంద గ్రాములు
పిస్తాపప్పు... వంద గ్రాములు
కిస్‌మిస్‌లు... 25 గ్రాములు
బెల్లం... 150 గ్రాములు
డాల్డా... 60 గ్రాములు
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
ఒక పాత్రలో గోధుమపిండి, ఎండుకొబ్బరి కోరు, ఖర్జూరం, జీడిపప్పు, పిస్తాపప్పులను తీసుకోవాలి. ఇందులో డాల్డాను, బెల్లాన్ని కరిగించి వేసి, తగినంత నీటిని పోసి ముద్దలా చేసుకోవాలి.
ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని... గారెల్లా ఒత్తుకుని, కాగుతున్న నూనెలో వేసి, బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. ఈ గారెలను చల్లారాక తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా..!