Publish Date: Mon, 06 Apr 2026 (22:56 IST)
Updated Date: Mon, 06 Apr 2026 (23:01 IST)
భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్-ఫార్వర్డ్ ఫుట్‌వేర్ బ్రాండ్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మోచీ. ఇప్పటికే తన అద్భుతమైన మోడల్స్‌తో యూత్‌ని ఆకట్టుకున్న మోచీ.. ఇప్పుడు తాజాగా ఈ సీజన్ కోసం సరికొత్త కలెక్షన్‌ను ఆవిష్కరించింది. తమ ఫుట్‌వేర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాలనుకునే వారి కోసం రూపొందించిన ఈ తాజా కలెక్షన్... చూడగానే మిమ్మల్ని అమితంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఇది ఒక బోల్డ్, ఎక్స్‌ప్రెసివ్ కలెక్షన్.
నేటి తరం వినియోగదారుల కోసం రూపొందించబడిన ఈ కలెక్షన్, ట్రెండీగా ఉంటూనే సౌకర్యాన్ని సజావుగా అందిస్తుంది. తద్వారా స్టైల్ స్టేట్‌మెంట్-మేకింగ్ స్టైల్స్‌తో మన వ్యక్తిత్వాన్ని పర్‌ఫెక్ట్‌గా చాటిచెప్తుంది. హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనే క్యాంపెయిన్‌ను కొనసాగింపుగా, ఈ తాజాగ కలెక్షన్ ఉల్లాసభరితమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన శక్తిని మనకు అందిస్తుంది.
ఈ క్యాంపెయిన్, అందరిలో ప్రత్యేకంగా నిలబడటానికి మనం ఏమాత్రం భయపడకూడదు అనే భావను చాటి చెప్తుంది. అందరి దృష్టిని ఆకర్షించేలా రూపొందించబడిన ఈ కలెక్షన్, తమదైన శైలిని సొంతం చేసుకున్న మహిళల కోసం నిర్మించబడింది. అందంగా కన్పించేందుకు సిద్ధం చేసిన వివరాలు, మెటాలిక్ ఫినిషింగ్‌లు, సమకాలీన సిల్హౌట్‌ల ద్వారా మెరుపు, స్టేట్‌మెంట్, సౌకర్యాన్ని ఒకచోట చేర్చుతుంది. పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నా లేకపోయినా, ఈ స్టైల్స్ మన అజెండా ప్రకారం లేదా లేకపోయినా సిద్ధంగా ఉంటాయి.
ఇక పురుషుల కోసం, మోచీ బ్రాండ్‌లో ఓపెన్-టో చంకీ సోల్ స్లిప్-ఆన్‌లను ప్రారంభించింది. ప్రీమియం టెక్స్చర్‌లతో కూడిన బోల్డ్, ఆర్టిస్టిక్ సోల్స్‌ను కలిగి ఉన్న కలెక్షన్, రోజువారీ సౌలభ్యాన్ని అందిస్తూనే ఒక బలమైన గుర్తింపును ఇస్తుంది. సౌకర్యం, స్టేట్‌మెంట్ డిజైన్‌ల కలయికతో ఇది క్యాజువల్ ఫుట్‌వేర్‌కు ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది. ఈ తాజా కలెక్షన్‌తో, మోచి సెల్ఫ్ స్టైల్‌కు మరింత ప్రాధాన్యతను ఇస్తుంది. ప్రతి జత ఒక లుక్‌ను పూర్తి చేయడానికి, అదే సమయంలో, అప్రయత్నంగా అందరి దృష్టిని ఆకర్షించడానికి రూపొందించబడింది. ఈ కలెక్షన్ ఇప్పుడు మోచి షూస్ స్టోర్లలో, ఆన్‌లైన్‌లో mochishoes.comలో అందుబాటులో ఉంది.