Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీరువా నిండా దుస్తులే... కానీ ఆ దుస్తులు మాత్రం వేసుకోరు... ఎందుకనీ...?

బీరువా నిండా దుస్తులే... కానీ ఆ దుస్తులు మాత్రం వేసుకోరు... ఎందుకనీ...?

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

, శుక్రవారం, 9 ఆగస్టు 2013 (19:44 IST)
WD

అవును. చాలామంది అలా దుస్తుల షాపుకు వెళ్లి కంటికి నచ్చింది కదా అని తోచిన దుస్తులు కొనేస్తుంటారు. కొన్న తర్వాత ఇంటికి వచ్చి ఏదో ఒకట్రెండు రోజులు వాటిని ధరించి మోజు తీరాక వాటిని ఇస్త్రీ చేసి బీరువాలో మడతపెట్టి దాచేసినట్లు ఉంచేస్తారు. ఇలాంటి జతలు దుస్తుల అలమరాలో ఎన్ని ఉన్నాయి...? వాటిని సంవత్సరంలో ఒక్కసారయినా ధరిస్తున్నారా...? ఇలాంటి స్థితిలో మీ అలమరా ఉందా... ఐతే ఈ క్రింది వాటిని మీరు చదివి తీరాల్సిందే.

webdunia
WD
మీ అలమరాలో మీరు ధరించిన దుస్తులు మూలుగుతున్నాయా...
మీరు ఏడాదిలో ఒక్కసారి కూడా ధరించకుండా అలమరాలో మూలుగుతున్న దుస్తుల్ని వెంటనే బయటకు తీసి పేదలకో లేదంటే తెలిసినవారికో ఇంకా కాదంటే పాత స్టీలు సామానుల వారికి అమ్మేయండి. ఎందుకంటే... మీరు ధరించకుండా అలమరాలో మూలన పడేసిన దుస్తులు మీ స్టయిల్ కాదన్నమాట. మీరు అనుకోకుండా కొనుగోలు చేసిన దుస్తులు. అందువల్ల వాటిని మీరు ధరించలేకపోతున్నారు.

webdunia
WD
దుస్తుల్లో కొన్ని మీరు ధరిస్తే ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. అలాంటి దుస్తులను ప్రత్యేకమైన అలమరాలాలో పెట్టుకోండి. కొన్ని దుస్తులు చూసేందుకు ఆకర్షణగా ఉన్నప్పటికీ వేసుకుంటే శరీరాకృతికి నప్పవు. ఫేడవుట్ చేస్తాయి. ఈ విషయం మీ సన్నిహితులు కూడా అప్పుడప్పుడు చెపుతుంటారు. అలాంటి దుస్తులను మరోవైపు సర్దుకోండి.

webdunia
WD
మీ శరీరాకృతికి తగ్గట్లుగా ఉండాలి
దుస్తులను కొనుగోలు చేసేటపుడు మన శరీరాకృతికి తగినవిగా ఉండేట్లు కొనుక్కోవాలి. చర్మపు రంగు నల్లగా ఉన్నవారు పూర్తి ఎరుపు దుస్తులు ధరిస్తే ఎలా ఉంటుంది...? నప్పదు కదా...? అలాంటివారు లేత రంగులను సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా బక్కపలుచగా ఉండేవారు... బొద్దుగా ఉండేవారు కాటన్, టెరీకాటన్... ఇలా పలు రకాల దుస్తులను కొనుక్కోవాలి. బక్కపలుచగా ఉన్నవారు సిల్క్ దుస్తులు ధరిస్తే మరీ పీలగా ఉన్నట్లు అగుపిస్తారు. కనుక వారు కాటన్ దుస్తులను తీసుకోవాలి.

webdunia
WD
మహిళల విషయానికి వస్తే... నడుము, బ్రెస్ట్ సైజులను దృష్టిలో పెట్టుకుని దుస్తుల షాపింగ్ చేయాలి. నడుము వదులుగా ఉన్నా, బ్రెస్ట్ సైజు తేడాగా ఉన్నవి తీసుకున్నా అవి నప్పవు. అలాంటి దుస్తులు మళ్లీ అలమలారా దిబ్బలా మారిపోతాయి. కనుక ఎంతో ఖరీదు పెట్టి దుస్తులను కొనుగోలు చేసేటపుడు ఎంతమాత్రం రాజీ పడకూడదు.

webdunia
WD
షాపింగ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దుస్తులను కొనుగోలు చేయాలి. లేదంటే డబ్బు ఒక్కటే కాదు... మీ సమయమూ, మీ బీరువాలోని అలమరాతోపాటు అన్నీ ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా ఆ దుస్తులు ఏళ్లకు ఏళ్లు మీ బీరువాలో మూలగుతూ ఉండటం తప్ప ఫలితం ఉండదుమరి.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu