Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సునందా పుష్కర్‌ -శశిథరూర్ ప్రేమాయణం.. ఆసక్తికర అంశాలు!

సునందా పుష్కర్‌ -శశిథరూర్ ప్రేమాయణం.. ఆసక్తికర అంశాలు!
, బుధవారం, 2 జులై 2014 (16:01 IST)
మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మరణం మరోమారు మీడియలో ప్రాధాన్యత సంతరించుకుంది. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు ఎయిమ్స్ పోర్సెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేశాయి. ఫలింతా సునందా పుష్కర్ మృతి చుట్టు తాజాగా వివాదం ముసురుకుంది. సునంద, ఆమె మృతి వెనుక కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. 
 
* 2009 అక్టోబరు నెలలో ఓ పార్టీలో సునందా పుష్కర్‌లు, శశిథరూర్‌లు కలుసుకున్న వీరు 2010లో ఒకటయ్యారు. 
* 2010లో ఐపీఎల్‌లో కోచి జట్టును సునందా కొనుగోలు చేయడం వెనుక 70 కోట్ల అవినీతి జరిగిందనే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 
* సునందా పుష్కర్ 2014 జనవరి 17 తేదిన ఢిల్లీలోని హోటల్ లీలా ప్యాలెస్‌లోని సూట్ నంబర్ 345లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. 
 
* సునందా మృతదేహంపై 12 గాయాలున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఆ గాయాలు ప్రాణాంతకం కాదని చెప్పడం అనేక సందేహాలు రేకెత్తాయి. సునందపై దాడి జరిగిందా అనే అనుమానాలు తలెత్తాయి. 
* సునంద మరణించడానికి ముందు రోజు పాకిస్థానీ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో శశిథరూర్ తన సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో గొడవ పడినట్టు సమాచారం. అంటే వీరిద్దరి మధ్యా మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందనే విధంగా సునంద ట్విట్టర్‌లో సందేశాల్ని పోస్ట్ చేశారు. 
 
* ఇపుడు సునందా పుష్కర్‌ది సహజమరణమంటూ నివేదిక ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు, పరువురు యూపీఏ కేంద్ర మంత్రులు ఒత్తిడి తెచ్చినట్టు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో సునందా పుష్కర్ మరణం మరోమారు వార్తలకెక్తింది.

Share this Story:

Follow Webdunia telugu