Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూగోళంపై మానవ జాతి పెరిగి ఇతర జాతులు అంతరిస్తే పెనుముప్పే... కానీ హిమాలయాల్లో...

భూగోళంపై మానవ జాతి పెరిగి ఇతర జాతులు అంతరిస్తే పెనుముప్పే... కానీ హిమాలయాల్లో...
, గురువారం, 9 జులై 2015 (15:48 IST)
ఎపుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూగోళంపై డైనోసార్లు ఉండేవనీ, వాటితోపాటు చాలా జీవరాశులు సంచరిస్తుండేవని శాస్త్రవేత్తలు చెపుతుంటారు. ఐతే ఒక్కసారిగా డైనోసార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోయిందట. ఆ సమయంలో ఇతర జీవరాశుల సంఖ్య దారుణంగా పడిపోయిందట. ఆ దశలో భూగోళంలో ఎలాంటి మార్పులు సంభవించాయో తెలియదు కానీ.. డైనోసార్లు మొత్తం సర్వనాశనమయ్యాయి. వాటి తాలూకు జీవి ఒక్కటి కూడా భూమిపైన తిరుగుతున్న ఆనవాళ్లే లేకుండా పోయింది. అలాగే ప్రస్తుతం భూగోళంపై మానవ జాతి సంతతి పెరుగుతోంది. 
 
కొన్ని వందల రకాల జీవరాశులు అతివేగంగా అంతరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని వారు హెచ్చరిస్తున్నారు. మానవ జాతితో పాటు అడవుల్లో సంచరించే జీవుల ఉనికి కోసం ప్రాకులాడాల్సిన అవసరం మానవ జాతికి ఉందని అంటున్నారు. ఐతే ఇప్పటికే కనుమరుగైపోయిన జాతులు చాలానే ఉన్నాయి. మనం పల్లెటూర్లకు వెళితే... పిచ్చుకల కిచకిచలు ఇదివరకు వినిపించేవి. కానీ ఇప్పుడవి సెల్ ఫోన్ల రేడియేషన్ కారణంగా మొత్తంగా చనిపోయి, అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 
 
ఇదిలావుంటే హిమాలయాల్లో చాలా జంతుజాలాలు ఉండేవని చెపుతారు. ఒకప్పుడు గుంపుగుంపులుగా ధృవపు చిరుతపులులు తిరుగుతుండేవని చెప్పేవారు. కానీ వాటి ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఐతే తాజాగా కుమాన్ ప్రాంత హిమాలయాల్లో ధృవపు చిరుత సంచరిస్తూ కనబడిందట. ఆ చిరుత తాలూకు ఫోటోలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. 
 
మొత్తమ్మీద అంతరించిన జంతువులకు సంబంధించి ఏ ఒక్క జీవి కనబడినా దాని గురించి ఇలా చెప్పుకోవడం మామూలైంది. కానీ వాటి సంరక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం శూన్యమే.

Share this Story:

Follow Webdunia telugu