Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''సర్దార్ గబ్బర్ సింగ్'' ఫట్: పవన్ రాజకీయాలపై చెర్రీ కామెంట్... త్రివిక్రమ్ పూజ ఏమైంది?

''సర్దార్ గబ్బర్ సింగ్'' ఫట్: పవన్ రాజకీయాలపై చెర్రీ కామెంట్... త్రివిక్రమ్ పూజ ఏమైంది?
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (17:44 IST)
''సర్దార్ గబ్బర్ సింగ్'' ఫట్ కావడంతో ఇక సినిమాల్లో ఉండటం లాభం లేదనుకున్న పవన్ కల్యాణ్.. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని హింట్ ఇచ్చారు. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందని సర్దార్ రిలీజైన రెండు రోజుల తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాలంటే తనకు అంత ఇంట్రెస్ట్ లేదని.. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో సర్వం సిద్ధం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. 
 
ఇక 2019 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన పవన్.. మెగా ఫ్యామిలీని మొత్తం తనవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ వాది అని.. ఆయన్ని జనసేనకు రావాలని నిర్భంధించేది లేదన్నారు. అయితే మెగా హీరోలను తనవైపు తిప్పుకునేందుకు పవన్ చర్యలు చేపడతారా లేదా అనే దానిపై చర్చ సాగుతుండగానే మీడియా మెగా హీరోలను కదిలించింది. 
 
ఇటీవల ఓ మీడియా సంస్థ ప్రతినిధి రామ్ చరణ్‌తో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ‘పవన్ 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని చెపుతున్నారు మీరు ఆయనకు మద్ధతు ఇస్తారా ?’ అని ఆ మీడియా సంస్థ ప్రతినిధి రామ్ చరణ్‌ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడట. అనుకోని ఈ ప్రశ్నకు షాక్ అయిన చరణ్ ఒక్క క్షణం ఆలోచించి అతి తెలివిగా ‘మద్దతు అంటే ఏమిటి’ అని ఎదురు ప్రశ్న వేయడమే కాకుండా తానెప్పుడు అటువంటి పదం వినలేదని తెలివిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడని సమాచారం.
 
ఇదిలా ఉంటే.. పవన్ పైకి ఎంత డాంబికం ప్రదర్శిస్తున్నా.. ఈ సంవత్సరపు సూపర్ ఫ్లాప్‌గా పేరు తెచ్చుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ షాక్ నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..? పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ‘సర్దార్’ ఘన విజయం సాధించాలని తనకు ఎంతో నమ్మకం ఉన్న సిద్దాంతి చేత ‘సర్దార్ ఘన విజయం సాధించాలని పూజలు చేయించడమే కాకుండా ‘సర్దార్ స్పెషల్ షోకు అర్థరాత్రి 12.50 నిముషాలకు ముహూర్తం పెట్టించినా ఆ ముహూర్తం కూడ ‘సర్దార్’కు కలిసి రాకపోవడం త్రివిక్రమ్‌కు కూడా షాక్ ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu