Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (12:32 IST)
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. నిన్నటికి నిన్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ విమర్శలు మరింత తీవ్రస్థాయిలో వస్తున్నాయి. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరూ రక్షించలేరని, అందువల్ల ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక శకం మొదలనైట్టేనని అంటున్నారు. ఈ మేరకు పోస్టర్లు కూడా వేసేశారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలి ప్రాంతంలో ఆ మధ్య వేసిన కొన్ని పోస్టర్లలో సోనియా గాంధీ, ప్రియాంకల ఫొటోలు, వాళ్లకు సంబంధించిన నినాదాలు ఉన్నాయే తప్ప.. ఎక్కడా రాహుల్ గాంధీ ప్రస్తావన గానీ, ఆయన ఫొటో గానీ కనిపించిన పాపాన పోలేదు. దాంతో రాహుల్ శకం ఇంకా ప్రారంభం కావడానికి ముందే అంతం అయిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
 
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో రాహుల్ గాంధీని మంత్రి పదవి చేపట్టాలని పిలిస్తే.. అప్పుడే తనకు అనుభవం చాలదని, తర్వాత చేపడతానని అన్నారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం, ఇంకా మాట్లాడితే, అవకాశాలను చేజిక్కించుకోవడం నాయకత్వ లక్షణం. అది లేకపోవడం వల్లే రాహుల్ శకం ముగిసిందని అంటున్నారు. ఇక ప్రియాంక శకం ఎలా సాగుతుందో.. ఎన్నాళ్లుంటుందో చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu