Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపులేషన్ క్లాక్ : ఈ రోజుకి భారత దేశ జనాభా 128,76,92,601. ఎలా చెప్పగలం ?

పాపులేషన్ క్లాక్ : ఈ రోజుకి భారత దేశ జనాభా 128,76,92,601. ఎలా చెప్పగలం ?
, శనివారం, 24 జనవరి 2015 (18:21 IST)
పాపులేషన్ క్లాక్... 16.01.2015 నాటికి  భారత దేశం జనాభా 128,76,92,601.  అరె.. ఇది భళే ఉందే. సాధారణంగా క్లాక్ అంటే టైం చెప్పేది కానీ, ఇలా జనాభా చెప్పే క్లాక్ ఉందా..  అవును ఈ క్లాక్ ఉంది. వారు ఏ రోజుకారోజు జనాభా ప్రతీ రోజు చెబుతారా... అరే ఇది భళే ఉంది. దాదాపు 5 వేల కిలో మీటర్ల పరిధి ఉన్న భారత దేశంలో ఏ మూలన ఎవరు పుడుతున్నారు..? ఎంత మంది పుడుతున్నారు.? ఎంత మంది చనిపోతున్నారు.. ? ఇవన్నీ లెక్కేసి జనాభా చెప్పేయడం అంత సులభమా..? ఎలా చెబుతారు.? రండి తెలుసుకుందాం. 
 
దేశంలోని చాలా విశ్వ విద్యాలయాలలో పాపులేషన్ స్టడీస్ అని ఒక విభాగం ఉంటుంది. దీని పనే అది. జనాభా మీద స్టడీస్ చేయడమే. పురుషులెందరున్నారు..? స్త్రీలు ఎంతమంది ఉన్నారు.? వారిలో యువతులెంత మంది.? యువకులెంత మంది.? వితంతవులెంత మంది ? ఎంత మంది చనిపోతున్నారు? ఎంత మంది పుడుతున్నారు? మనిషి సగటు జీవిత కాలమెంత? ఇలాంటి ఎన్నో అంశాలపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు. 
 
ఆ విభాగం ఏ రోజుకారోజు జనాభాను ఇట్టే లెక్కగడుతుంది. అది ఇప్పటి నుంచి కాదు. 1982 నుంచి చేస్తూనే ఉన్నారు. సాధారణంగా అయితే పదేళ్ళకొకమారు ప్రభుత్వం జనాభా లెక్కలను గణిస్తారు. ఇది మనకు తెలిసిందే.. ముంబయిలోని పాపులేషన్ విభాగం దినసరి లెక్కలను చెబుతుంది. ఇలా చెప్పడాన్నే ‘పాపులేషన్ క్లాక్’ అంటారు. 
 
పాత జనాభాను లెక్కేసుకుని జనాభా పెరుగుదల శాతం, పుట్టుక శాతం, మరణించే శాతం, అలాగే జీవన ప్రమాణాలను లెక్క గట్టి జనాభాను లెక్కిస్తారు. ఏ రోజుకారోజు ‘ పాపులేషన్ క్లాక్ ’ ద్వారా జనాభాను ప్రకటిస్తారు. ఈ లెక్కల్లో 0.12 నుంచి 0.5 శాతం తేడాతో ఇట్టే చెప్పేస్తారు. 2011లో జనాభా లెక్కలకు పాపులేషన్ క్లాక్ కు కేవలం 12 లక్షల జనాభానే తేడా వచ్చింది. 
 
 

Share this Story:

Follow Webdunia telugu