Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ మంచే చేశారు.. బాబు భయపడిపోతున్నారు.. అభివృద్ధి పనులు సూపర్!

పవన్ మంచే చేశారు.. బాబు భయపడిపోతున్నారు.. అభివృద్ధి పనులు సూపర్!
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (14:41 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలకు మంచే చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గందరగోళ పరిస్థితుల్ని ఆయన చక్కదిద్దారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఏపీకి సమర్థవంతమైన నాయకత్వం కావాలనుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీలకు మద్దతు ప్రకటించారు. తద్వారా అభివృద్ధి సుసాధ్యం అవుతుందని నమ్మారు. ఇందుకే సరైన టైమ్‌లో బరిలోకి దిగి ఏపీకి సరైన న్యాయం చేయాలనుకున్నారు. కేంద్రంలో ఉండే బీజేపీకి.. రాష్ట్రంలో టీడీపీకి సపోర్ట్ చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి పవన్ కల్యాణ్ ప్రధాన కారణమయ్యారు. 
 
పవన్‌కు ఇచ్చిన మాట ప్రకారమే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలు రానున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని మాత్రం పక్కనబెడితే.. రాష్ట్రాన్ని కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీకి ప్రత్యేక నిధుల కింద రూ.1000 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో రూ.350 కోట్లను నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి వెచ్చించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నిధుల్లో గవర్నర్ నివాసం, హైకోర్టు, అసెంబ్లీ తదితర ప్రధాన మౌలిక వసతులను కల్పించుకోవాలని కేంద్రం సూచించింది. విభజన తర్వాత ఏపీకి 2014-15ఆర్థిక సంవత్సరంలో రూ.4,403 కోట్లను కేంద్రం ఇచ్చినట్లు తెలిపింది. 2015-16 సంవత్సరానికి గాను పన్ను రాయితీలను ఇచ్చామని కేంద్రం గుర్తు చేసింది.
 
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాభివృద్ధి విషయంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రం ప్రత్యక్షంగా ఇన్‌వాల్వ్ కాకపోయినా బాబుకు సపోర్ట్ చేసి.. తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు కట్టేసిందనే వాదన ఉంది. మరోవైపు చంద్రబాబు రాజధాని నిర్మాణం, ప్రజా సంక్షేమ పథకాలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం వంటి ఇతరత్రా కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రాభివృద్ధి పనులు మాత్రం బాబు హయాంలో సూపర్‌గా జరిగిపోతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu