పవన్ కళ్యాణ్ అప్‌సెట్... అడ్డంకొట్టిన జైట్లీ... పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు ఫ్యాన్స్‌కు నో...?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకున్నాడంటే అది జరిగే వరకూ దాని అంతుచూస్తాడనే పేరుంది. ఒక్కసారి ఫిక్స్ అయితే దాన్ని సాధించేవరకూ విశ్రమించరని పేరుంది. ఐతే ప్రత్యేక హోదాపై ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న కేంద్ర పెద్దలు ప్రకటన చేస్తారనే వార్తలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకున్నాడంటే అది జరిగే వరకూ దాని అంతుచూస్తాడనే పేరుంది. ఒక్కసారి ఫిక్స్ అయితే దాన్ని సాధించేవరకూ విశ్రమించరని పేరుంది. ఐతే ప్రత్యేక హోదాపై ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న కేంద్ర పెద్దలు ప్రకటన చేస్తారనే వార్తలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఐతే ప్రత్యేక హోదాపై మొదట్నుంచీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ వాదిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు సమాచారం.
ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేకుండా ప్రకటిస్తే ప్రభుత్వం లేనిపోని చిక్కులు కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ప్రత్యేక హోదాకు సమానంగా... అంటే హోదాకు ఏమైతే ఇస్తామో వాటినే ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇవ్వాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఐతే భాజపా చీఫ్ అమిత్ షా మాత్రం ప్రత్యేక హోదా ప్రకటించేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై తుది నిర్ణయానికి రావలసి ఉండగా, జైట్లీ మాత్రం ప్రత్యేక ప్యాకేజీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఒకింత అప్సెట్ అయినట్లు సమాచారం.
అనుకున్నట్లు ప్రత్యేక హోదా కాకుండా మరేదైనా ఇస్తే... దానివల్ల కలిగే ప్రయోజనం ఎంతమేరకు అన్నదానిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణకు సిద్ధం కావాలని పవన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా సాధన కోసం తను చేస్తున్న పూర్తిస్థాయి కసరత్తులో భాగంగా తన పుట్టినరోజు సెప్టెంబరు 2 సెలబ్రేషన్స్ భారీగా ఉండబోదని సంకేతాలు కూడా వస్తున్నాయి. ఫ్యాన్స్ పవర్ స్టార్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ పెద్దఎత్తున చేయాలనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.