Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక హోదాపై పవన్ ప్రశ్నలే... ప్రశ్నలు...? ఈ పర్యాయం కాంగ్రెస్‌ను..

ప్రత్యేక హోదాపై పవన్ ప్రశ్నలే... ప్రశ్నలు...? ఈ పర్యాయం కాంగ్రెస్‌ను..
, సోమవారం, 13 జులై 2015 (21:36 IST)
అదునూ పదునూ పోయాక నా మొగుడు వీర సేద్యగాడని అన్నదట ఓ భార్య వెనకటికి. అలా ఉంది. మన పవన్ కళ్యాణ్ ప్రశ్నలధాటి. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని చాలా మంది ప్రశ్నించారు. అందరూ డిమాండ్ చేసినప్పుడు ఆయన ప్రశ్నిస్తే ప్రత్యేక ఏముంటుందని అనుకున్నారో ఏమో పాపం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై అందరూ ప్రశ్నించి.. ప్రశ్నించి అలసిపోయిన తరువాత పవన్ లేచాడు. పది రోజులుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతున్నారు. 
 
ప్రెస్‌మీట్ పెట్టి తెలుగుదేశం వారిని దుమ్ము దులిపేశారు. వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీలు వ్యాపారస్తులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు కేశినేని నాని, సుజనా చౌదరిలు తగు స్థాయిలో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు సూచనతో టిడిపి నేతలు మౌనం వహించారు.
ఇప్పుడు, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చిన పార్టీ ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. లలిత్ మోడీ పైన ఉన్న ప్రేమ 5 కోట్ల ఆంధ్రుల పైన లేదా అని నిలదీశారు. దీనిపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా స్పందించినప్పటికీ... హోదా పైన పవన్ ట్వీట్లు ఏపీ నేతల్లో కదలిక తెస్తున్నాయంటున్నారు.
 
పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు పార్టు టైమే అని చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పటికే విమర్శలు చేశారు. మరికొందరైతే మరో చిరంజీవేనని, ఆయన స్థాపించిన జనసేన పార్టీ మరో ప్రజారాజ్యమేనని మండిపడ్డారు. పవన్ కూడా దానికి తగినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బకు వంగుతుందనే సూత్రాన్ని ఆయన మరిచినట్లున్నారు. వేడి తగ్గిన తరువాత ఆయనకు తీరిక దొరికనప్పుడు సుత్తి తీసుకుని వేటు వేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలున్నాయి. 
 
సాదాసీధాగా ట్విట్టర్లో స్పందిస్తూ ప్రత్యేక హోదాపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడుతున్నారు. శివాజీ ప్రత్యేక హోదాపై పెద్ద ఉద్యమమే చేస్తే... పవన్ నాడు నోరు కూడా తెరవలేదు.. నేడు మాత్రం ఆయన ప్రశ్నించమంటే ప్రశ్నించాలి.. ఆగమంటే ఆగాలా..? అని రాజకీయ పక్షాలు తిరుగుబాటు చేస్తున్నాయి. ఎంతైన అక్కడ ప్రశ్నించింది పవన్ కాబట్టి విలువ ఉంటుంది మరి

Share this Story:

Follow Webdunia telugu