Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెడ్రూంకు వెళుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్స్... షాకింగ్ నిజాలు...

ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు ఎక్కువయిపోతున్నాయి. ఆఖరికి బ్యూటీషియన్ శిరీషది కూడా దాదాపు ఇలాంటిదే. బతుకు తెరువు కోసం ఆఫీసు పనిలో చేరిన ఆమెను రాజీవ్ లోబరుచుకోవడం చివరికి ఆమె ఆత్మహత్యకు దారితీసింది. ఇలాంటివి మనిషి చనిపోయిన తర్వాతనో, లే

బెడ్రూంకు వెళుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్స్... షాకింగ్ నిజాలు...
, సోమవారం, 26 జూన్ 2017 (17:06 IST)
ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు ఎక్కువయిపోతున్నాయి. ఆఖరికి బ్యూటీషియన్ శిరీషది కూడా దాదాపు ఇలాంటిదే. బతుకు తెరువు కోసం ఆఫీసు పనిలో చేరిన ఆమెను రాజీవ్ లోబరుచుకోవడం చివరికి ఆమె ఆత్మహత్యకు దారితీసింది. ఇలాంటివి మనిషి చనిపోయిన తర్వాతనో, లేదంటే ఏమయినా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఈ బయటపడుతున్నాయి. 
 
ఇలాంటి అక్రమ సంబంధాలకు కారణం చాలామటుకు ఆఫీస్ ఫ్రెండ్‌షిప్పే అంటున్నాయి సర్వేలు. ఇటీవల ఇంగ్లండులో చేపట్టిన ఓ సర్వేలో ఆఫీస్ కొలీగ్స్‌తో తాము శరీరక సుఖాన్ని చవిచూస్తున్నట్లు 80 శాతం మంది అంగీకరించడం షాకింగ్‌కు గురి చేస్తోంది. 
 
ఐతే ఈ సంఖ్య మనదేశంలో తేడా వుండవచ్చు కానీ అక్రమ సంబంధాలు మాత్రం చాలావరకూ ఆఫీసు ఫ్రెండ్స్ తోనే సాగుతున్నట్లు తేలింది. ఇంటికంటే ఆఫీసులోనే ఎక్కువసేపు సమయాన్ని కేటాయించడంతో సహోద్యోగుల పట్ల చనువు పెరగడం, అది కాస్తా అక్రమ సంబంధాలకు దారితీయడం జరుగుతుందని తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు బిడ్డ.. ఎవరు?