Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చినబాబు అమెరికా పర్యటన ఎందుకో..?

చినబాబు అమెరికా పర్యటన ఎందుకో..?
, శనివారం, 2 మే 2015 (20:52 IST)
రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం పార్టీని నడుపుతున్న నారా లోకేష్ అమెరికా ఎందుకు వెళ్లుతున్నారు ?  ఆయనేమైనా ఉప ముఖ్యమంత్రా..? మంత్రా..? లేదా.. ఎమ్మెల్యేనా..? ఇవేవి కావు. అయినా ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం నిధులను సంపాదించే పనిలో పడ్డారు. అందుకు కోసం ప్రభుత్వం అధికారులను వాడకోవడంపై విమర్శలు వినవస్తున్నాయి.  దాదాపుగా ఆయన అధికారక కార్యక్రమాలను అనధికార ముఖ్యమంత్రి హోదాలోనే నెరుపుతున్నారనడంలో అనుమానం లేదు. తాను చదివిన వర్శటీలో తన పరిచయస్థులను కలుపుకోవడానికి అధికార లాంఛనాలతో వెళ్లున్నారనే విమర్శలు వినివస్తున్నాయి. 
 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వెల్‌ఫేర్ ఫండ్ కో ఆర్డినేటర్ నారా లోకేష్ ఆదివారం అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, సంక్షేమనిధి కోసం పర్యటిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఆయన ఏకంగా అనధికార ముఖ్యమంత్రి హోదాలోనే పర్యటిస్తున్నారు. ఆయన వెంట ఇద్దరు ఐఎఎస్ లు ఉంటారు. పది రోజులపాటు జరిగే ఈ పర్యటనలో అమెరికాలోని ఎన్నారై పారిశ్రామికవేత్తలు, అమెరికాకు చెందిన పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. ఈ నెల 7న పోర్ట్‌ల్యాండ్ ఆర్గాన్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొనే ఓ కార్యక్రమంలోనూ పాల్గొననున్న లోకేష్ అక్కడే ఆయనతో ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం. 
 
గతంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న లోకేష్ ఇప్పుడా పరిచయాలన్నీ వాడుకుని అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రాథమికంగా రూ.1500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగనుంది. అయితే పెట్టుబడులు పెట్టే వారికి ఎటువంటి హామీలు ఇస్తారు ? ఏ స్థాయిలో ఇస్తారనేది ప్రశ్న? అందుకే ఆయన వెంట ఐఏఎస్ అధికారులను తీసుకెళ్లారా? ఒకప్పుడు జగన్ నాటి ముఖ్యమంత్రితో కలసి స్టేజీ మీద కూర్చుంటేనే తెలుగుదేశం పార్టీ విమర్శల వర్షం గుప్పించింది. మరి నేడు... ?
 
నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ నేరుగా ఐఏఎస్ లను వెంట బెట్టుకుని దాదాపుగా అధికారక కార్యక్రమంలానే విదేశాలకు వెళ్లడాన్ని ఏమనుకోవాలి? అనేది విమర్శకుల ప్రశ్న. సొంత ఊరికి చేయూతనందించే వారికి ఓ అవకాశం కల్పించి వారివారి గ్రామాలు అభివృద్ధిపర్చే వ్యూహంలో భాగంగా ఏర్పాటైన ఆకర్షణీయ గ్రామం. ఆకర్షణీయమైన రాష్ర్టం పథకానికి కూడా అమెరికాలో లోకేష్ ప్రచారం కల్పించనున్నారు. కనీసం 250 గ్రామాలకైనా ఎన్నారైలు ముందుకొచ్చేలా చూడాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ వెంట ప్రభుత్వం తరపున ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్తున్నారు. మరి దీనని ఏమనాలి? తండ్రి స్థానంలో తర్పీదు అవుతున్నారా..? 

Share this Story:

Follow Webdunia telugu