Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్తమంత్రి అమరనాథ రెడ్డి అంతు చూస్తాం...ఎవరు?

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి పార్టీకే జిల్లా అధ్యక్షుడుగా ఉండి చివరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై అలకతో ఎన్నికలకు ముందు వైసిపిలోకి వెళ్ళిపోయారు చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్.అమర్నాథ్ రెడ్డి. ఆ తర

కొత్తమంత్రి అమరనాథ రెడ్డి అంతు చూస్తాం...ఎవరు?
, సోమవారం, 3 ఏప్రియల్ 2017 (11:13 IST)
తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి పార్టీకే జిల్లా అధ్యక్షుడుగా ఉండి చివరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై అలకతో ఎన్నికలకు ముందు వైసిపిలోకి వెళ్ళిపోయారు చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్.అమర్నాథ్ రెడ్డి. ఆ తర్వాత వైసిపిలో గెలిచినా తనకు పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతో తిరిగి బాబు వద్ద మంతనాలు చేసుకుని వచ్చేశారు. మొదట్లో పార్టీలోకి వచ్చిన అమర్ ఏ షరతులు లేకుండానే వచ్చారని అందరికీ తెలుసు. కానీ అమర్నాథ్ రెడ్డి ఇంత పనిచేశావే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అదే కొత్తమంత్రి అయిపోవడం. చాపకింద నీరులా సాగిన అమర్నాథ్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకోవడంలో విజయం సాధించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి ఒకప్పుడు బాబుకు అత్యంత సన్నిహితులు. పార్టీలో కీలకంగా సీనియర్ నేతగా వ్యవహరించారు. దీంతో తన సొంత జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డిని బాబు నియమించారు. కొన్నిరోజుల వరకు బాగానే పనిచేసిన అమర్ సీనియర్లు, పార్టీపై అలకతో పార్టీనే వదిలి వెళ్ళిపోయారు. వైసిపిలో ఎలాగోలా టిక్కెట్‌ను సంపాదించుకున్న అమర్ గెలిచాడు. అసలు అమర్నాథ్ రెడ్డి స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుస్తాడన్నది రాజకీయ విశ్లేషకుల భావన. అలాంటి వ్యక్తి ప్రస్తుతం జంప్ జిలానీలామారి టిడిపిలో వెళ్ళి మంత్రి అయ్యారు.
 
అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఎవ్వరికీ ఇష్టం లేదు. క్రిందిస్థాయి కార్యకర్త నుంచి పార్టీ సీనియర్ నేతల వరకు ఎవ్వరికీ కూడా అమర్ పార్టీలోకి రావడమే ఇష్టం లేదు. అందులోనూ మంత్రి పదవి ఇచ్చారంటే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అమర జిల్లాలో అడుగుపెడితే ఆయన అంతు చూస్తామంటున్నారు కొంతమంది నేతలు. అంతు చూడటమంటే గొడవ పడటం కాదు... సహాయ నిరాకరణ చేయడం. 
 
అంటే ఎవరు కూడా ఆయనకు సహకరించకపోకుండా పోవడమన్నమాట. నిన్నటి నుంచే నేతలందరూ గుర్రుఉగా ఉన్నారు. కనీసం స్వాగతం పలికేందుకు కూడా ఎవరూ ఎయిర్ పోర్ట్ పోకూడదని నిర్ణయించుకున్నారట. పార్టీలో గాలిముద్దుకృష్ణమనాయుడుతో పాటు ఎంతో మంది సీనియర్లు ఉంటే అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఏ మాత్రం ఇష్టం లేదు ఆ పార్టీ నేతలకు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్‌ జియో మరో సంచలనం?.. త్వరలో ఐపీ టీవీ ప్రసారాలు