Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు కేసీఆర్ భేటీకి ముహుర్తం.. వేదిక గవర్నర్ ఇఫ్తార్ విందు!

చంద్రబాబు కేసీఆర్ భేటీకి ముహుర్తం.. వేదిక గవర్నర్ ఇఫ్తార్ విందు!
, బుధవారం, 23 జులై 2014 (12:03 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు ఒకప్పుడు మంచి మిత్రులు. ఇప్పడు బద్ద శత్రువులుగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు కేవలం కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రలు మాదిరిగా పక్కరాష్ట్ర ముఖ్యమంత్రిగానే చూస్తాం తప్పిస్తే అంతకుమించి ఎటువంటి ప్రత్యేకత లేదని కేసీఆర్ అంటుంటే, కోస్తా నాది. నెల్లూరు నాది. రాయలసీమ నాది  తెలంగాణా కూడా నాదే అంటున్నారీ నారా చంద్రబాబు నాయుడు గారు. 
 
ఒకప్పుడు వారిద్దరు మంచి మిత్రులే.! కలిసి తిరిగారు... ఉమ్మడిగా మహా కూటమితో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఒక వేళ ఇద్దరూ నేతలూ కలిస్తే కరచాలనం చేసుకుంటారా?. ఇద్దరు పలకరించుకుంటారా? పలకరిస్తే ఎవరు ముందు పలకరిస్తారు? ఇలాంటి అంశాలన్నీ ఉత్కంఠను రేపుతున్నాయి. ఇద్దరు కలిసేందుకు వేదిక రెఢీగా ఉంది. కానీ వీరిద్దరూ కలుస్తారా.... అనే అనుమానం మాత్రం అందరిలోనూ ఉంది. 
 
రాష్ట్ర విభజన తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి  (జూలై 23) గవర్నర్ నరసింహన్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కావడంతో అటు ఏపీ సీఎం చంద్రబాబును... ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇప్తార్‌కు పిలచారు గవర్నర్ సాబ్. సీఎంలే కాదు... మంత్రులు, అధికారులును కూడా గవర్నర్ ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హట్ టాపిక్‌గా మారింది. మరి ఇద్దరు నేతలూ కలిసి విందులో పాల్గొంటారో లేక ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్లిపోతారో వెయిట్ చేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu