Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి నోరు విప్పినా.. అమర్యాదే.. మరి పవన్ సంగతేంటి?

చిరంజీవి నోరు విప్పినా.. అమర్యాదే.. మరి పవన్ సంగతేంటి?
, గురువారం, 17 జులై 2014 (14:18 IST)
మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు అస్సలు కలిసిరాలేదు. ప్రశాంతంగా సినిమాలకే తన జీవితాన్ని అంకితం ఇచ్చుకోకుండా ఏదో మార్పు చేస్తానంటూ.. చిరంజీవి రాజకీయాల్లోకొచ్చి నానా అవస్తలు పడుతున్నారు. పీఆర్పీని మూసేయడం.. కాంగ్రెస్‌లో చేరడం.. పీఆర్పీని విలీనం చేయడం వంటివి జరగడం చిరంజీవి రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయి. 
 
ఇక 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత చిరంజీవి ఇటీవల రాజ్యసభలో పోలవరం బిల్లు విషయమై మాట్లాడుతూ ఉండగా రాజ్యసభ సాక్షిగా డిప్యూటీ చైర్మన్ కురియన్ చేత సెటైర్లు వేయించుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 
 
మూడు నిముషాలు మాట్లాడవలసిన చిరంజీవి తన ఊక దంపుడు ఉపన్యాసాన్ని వరస పెట్టి చదువుకుంటూ పోతూ ఎనిమిది నిముషాలు దాటిపోయినా, అధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ ఎన్ని సార్లు బెల్ కొట్టినా పట్టించుకోక పోవడంతో కోపంతో కురియన్ ఎవరో రాసిచ్చిన ప్రసంగం చదవడం సభా మర్యాద కాదు అంటూ సభ సమక్షంలో బహిరంగంగా చిరంజీవిపై సెటైర్లు వేయడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా మెగాస్టార్‌గా తెలుగు సినిమాను శాసించిన చిరంజీవికి ఇదేమి పరిస్థితి అని చిరంజీవి అభిమానులు అనుకునేట్లుగా చేసింది. 
 
ఇదిలా ఉంటే ‘జనసేన’ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తన శాయసక్తులా ప్రయత్నించి ఆ ప్రయత్నంలో విజయం సాధించి ఆ తరువాత మౌన ముద్రలోకి వెళ్ళిన పవన్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన విమర్శలు పవన్ అభిమానులకు తలనొప్పిగా మారాయి. మరి పవన్ కల్యాణ్ ఎప్పుడు మౌనం వీడుతారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu