Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు ఎంత చెప్పినా వరంగల్‌లో పోటీ చేయలేను : రాహుల్‌కు తెగేసి చెప్పిన వివేక్.. కారణమిదే?

మీరు ఎంత చెప్పినా వరంగల్‌లో పోటీ చేయలేను : రాహుల్‌కు తెగేసి చెప్పిన వివేక్.. కారణమిదే?
, గురువారం, 29 అక్టోబరు 2015 (09:14 IST)
వచ్చే నెలలో వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి కోసం టీడీపీ - బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే ముమ్మరంగా కరసత్తు చేస్తున్నాయి. ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ నేతలు మాత్రం కోడికూత వినిపించక ముందు నుంచే వరంగల్ బైపోల్ సమరంపై దృష్టిసారించారు. ఆసమయంలో వీరికి కనిపించి ఏకైక అభ్యర్థి పెద్దపల్లి మాజీ ఎంపీ జి వివేక్. కానీ, ఆయన పోటీకి ససేమిరా అంటున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
వివేక్‌ను వరంగల్‌ నుంచి పోటీకి దించితే... ఆయనను కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల రాజకీయ వ్యవహారాల నుంచి తప్పించేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్‌లో పోటీ చేస్తే ఆ రెండు జిల్లాలకు దూరంకావాల్సి వస్తుందని వివేక్‌ సైతం భావిస్తున్నారట. గెలిచినా ఓడినా ఆ రెండు జిల్లాల్లో రాజకీయాలకు తలుపులు మూసుకుంటాయని సన్నిహితులతో అంటున్నారట. 
 
ఇకపోతే తన తండ్రి దివంగత వెంకటస్వామి (కాకా)పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూపిస్తున్న అభిమానం కూడా వివేక్‌ని పోటీనుంచి వెనకడుగు వేసేలా చేస్తోంది. కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ట్యాంక్‌బండ్‌పై తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. అలాంటి పరిస్థితుల్లో తెరాస సర్కారుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగి తనకున్న సత్ సంబంధాలు దెబ్బతీసుకోవడం అవసరమా అని కూడా వివేక్‌ ఆలోచిస్తున్నారట. అందువల్లే పార్టీ పెద్దలు రాహుల్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలు దిగొచ్చి బతిమాలినా వివేక్ ఒప్పుకోకపోవడానికి కారణమనే ప్రచారం జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu