Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్ర సంస్థల పేర్లు చేర్చాలన్న మోదీ... అడ్డుకొట్టిన చైనా... పాక్ ఉగ్రవాద సంస్థలకు చైనా మద్దతా...?

బ్రిక్స్ సమావేశాల్లో చైనా అసలు రూపం ఏమిటో బహిర్గతమయ్యింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలోకి దొంగచాటుగా చొరబడి సైనికులపై దాడి చేసి హతమారుస్తుంటే, ఆ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలంటూ నరేంద్ర మోదీ బ్రిక్స్ డిక్లరేషన్లో చేర్చేందుకు యత్నించగ

ఉగ్ర సంస్థల పేర్లు చేర్చాలన్న మోదీ... అడ్డుకొట్టిన చైనా... పాక్ ఉగ్రవాద సంస్థలకు చైనా మద్దతా...?
, సోమవారం, 17 అక్టోబరు 2016 (12:18 IST)
బ్రిక్స్ సమావేశాల్లో చైనా అసలు రూపం ఏమిటో బహిర్గతమయ్యింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలోకి దొంగచాటుగా చొరబడి సైనికులపై దాడి చేసి హతమారుస్తుంటే, ఆ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలంటూ నరేంద్ర మోదీ బ్రిక్స్ డిక్లరేషన్లో చేర్చేందుకు యత్నించగా దానిపై చైనా ససేమిరా అన్నది. 
 
సంయుక్త తీర్మానం ప్రకటించేటపుడు కనీసం యురీ ఉగ్రవాద దాడుల పైనైనా చేర్చేందుకు భారతదేశం ప్రయత్నించగా దాన్ని కూడా చైనా అడ్డుకుంది. దీనితో కేవలం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు అన్ని దేశాలూ పరస్పర సహకారాన్ని అందించుకోవాలనీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను, జబాత్ అల్ నుస్రాలపై పోరాటం చేయాలని మాత్రమే డిక్లరేషన్లో జోడించారు. పాకిస్తాన్ భూభాగంపై భారతదేశంపైకి వస్తున్న ఉగ్రమూకల పేర్లను జోడించేందుకు చైనా గట్టిగా మొండికాలు అడ్డుపెట్టేసింది. దీనితో చైనా పాక్ ఉగ్రమూకల చేష్టలకు మద్దతు పలుకుతుందా అనే అనుమానం కలుగుతోంది. 
 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పినట్లుగా మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే సంశయం కూడా కలుగుతోంది. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతమాత్రం వెనుకాడకుండా భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతున్నారు. వారిని అడ్డుకోవాల్సిన పాకిస్తాన్ మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలని భారతదేశం చెపుతుంటే చైనా అందుకు తలకాయ అడ్డంగా తిప్పుతోంది. ఇదంతా చూస్తుంటే మున్ముందు మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్‌తో యుద్ధ విమానాల ఒప్పందం ప్రసక్తే లేదు: రష్యా