Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నన్నెవ్వరూ.. ఏమి చేయలేరు..? బాబు డిఫెన్సులో ఉండి మాట్లాడుతున్నారా.. !

నన్నెవ్వరూ.. ఏమి చేయలేరు..? బాబు డిఫెన్సులో ఉండి మాట్లాడుతున్నారా.. !
, బుధవారం, 2 సెప్టెంబరు 2015 (20:27 IST)
సాధారణంగా న‌న్ను మీరేం చేయ‌లేరు అంటూ స‌వాల్ చేసే చంద్రబాబు చాలా ఢిపరెంటుగా మాట్లాడుతున్నారు.. త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని, త‌న‌తో పెట్టుకున్నవాళ్లంతా ఏమైపోయారో అంద‌రికీ తెలిసిందే అనీ ఆ విష‌యం మీరు గుర్తుంచుకోవాల‌ని ప‌దే ప‌దే ఆయ‌న అంటున్నారు. ఆ మాటల్లో ఆయన కాన్ఫిడెన్స్ కంటే.. ఆందోళనే ఎక్కువగా ఉందంటున్న విమర్శలు పెరుగుతున్నాయి. దీనిని చూస్తే డిఫెన్సులో ఉన్నారా..? అనే అనుమానం కలుగుతోంది. 
 
దక్షిణాది రాష్ట్రాలలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశవ్యాప్త పరిచయాలు ఉన్నవ్యక్తి. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన నాయకుడు.. ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మాట్లాడుతున్న ప్రతిమారు ఆయన నన్నెవ్వరూ ఏమి చేయలేరు... నాతో పెట్టుకున్న వారంతా ఏమయ్యారో తెలుసు కదా.. అంటూ మాట్లాడుతున్నారు. 
 
మరీ ఎక్కువగా చెప్పాలంటే వైఎస్ ఏమయ్యారో తెలుసుకదా అని నేరుగానే చెబుతున్నారు. అంటే అర్థం ఏంటి..? ఆయన ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారా..? బెదిరించడానికి వైఎస్ మరణంలో చంద్రబాబు పాత్రేమి లేదు. మరి చంద్రబాబు ఎందుకు మాటి మాటికి నా పెట్టుకున్న వారు ఏమయ్యారో తెలుసు కదా అని అంటున్నారు.. అంటే శాపనార్థాలు పెడుతున్నారన్నమాట. 
 
సహజంగా శాపనార్థాలు ఎవరు పెడతారు. నిస్సాహాయలు పెడుతుంటారు. ఎదుటి వారిని ఏమి చేయలేక అస్త్రసన్యాసం చేసిన సందర్భంలో మాట్లాడే మాటలు అవి. వీరోచితంగా ఛాలెంజ్ చేసి మాట్లాడే చంద్రబాబు అపరచాణుక్యుడుగా పేరు పొందిన చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నాడేమిటి? అసెంబ్లీ మాట్లేడే సమయంలో ఊగిపోతున్నాడు. వైఎస్సే ఏమి చేసుకోలేకపోయాని పదే పదే మాట్లాడుతున్నారు. ఆయనలో ఆత్మవిశ్వాసం లోపించిందా అనే అనుమానం కలుగుతోంది.
 
అటు కేంద్రం నుంచి సహాయం అందక ఇటు రాష్ట్రంలో సమ్మెలు, అపశృతులు ఎక్కువ అవుతుండడంతో ఏమి చేయాలో పాలుపోక అలా బెదిరింపులను శాపనార్థాలను కలగలిపి మాట్లాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.  కాని చంద్రబాబు ప‌దే ప‌దే  మీరు న‌న్నేం చేయ‌లేరు... అంటూంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనిపించ‌క‌పోగా ఎబ్బెట్టుగా ఉంది. పైగా త‌న‌ను ఏదేదో చేయాల‌నుకున్నవారు ఏదో అయిపోయారంటే... ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నారనడం కంటే ఆత్మరక్షణలో పడ్డారని అనుకోవాల్సి వస్తుందనే భావన వ్యక్తమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu