Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమిత్ షా ఎవరు.. ఆయన పూర్తి నేపథ్యమేంటి?

అమిత్ షా ఎవరు.. ఆయన పూర్తి నేపథ్యమేంటి?
, బుధవారం, 9 జులై 2014 (13:36 IST)
భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, కుడిభుజంగా పరిగణించే అమిత్ షా నియమితులయ్యారు. పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షాను ఎన్నుకున్నట్లు ఆ పార్టీ పాత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం బీజేపీ పార్లమెంటరీ పార్టీ బుధవారం సమావేశమై నిర్ణయించారు. 
 
అమిత్ షా పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్రా షా. 1964 అక్టోబర్ 22వ తేదీన మహారాష్ట్రలో జన్మించిన ఈయన... ఆది నుంచి ఆర్ఎస్ఎస్‌తో పరిచయం ఉంది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలలో చురుగ్గా పని చేశారు. 1997లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం ఆయన ఐదుసార్లు శాసనసభ్యునిగా గెలుపొందారు. గుజరాత్ ప్రభుత్వంలో పలు కీలక శాఖలు చేపట్టారు. హోం, న్యాయ, శాంతిభద్రతలు, ఎక్సైజ్, రవాణా శాఖ తదితరాలను ఆయన నిర్వహించారు. 
 
ఆ తర్వాత అమిత్ షా 1986లో బీజేపీలో చేరారు. 1997లో సార్‌కేజ్ నుండి తొలిసారి గెలుపొందారు. ఇటీవల జరిగి సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 80 స్థానాలకు గాను 72 స్థానాల్లో గెలిచింది. ఈ క్రెడిట్ అమిత్ షాదే. యూపీ ఫలితాలతో ఆయన జాతీయ దృష్టిని ఆకర్షించారు. అయితే, గోద్రా అల్లర్లు, సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులు ఆయన పైన ఉన్నాయి. 2003 నుండి 2010 వరకు మోడీ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. జైన మతానికి చెందిన అమిత్ షాకు భార్య సోనాల్ షా. ఒక కొడుకు జై షా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu