Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంపీ లగడపాటికి కేసీఆర్‌ అండ్ కోపై అంత ప్రేమెందుకో!!

ఎంపీ లగడపాటికి కేసీఆర్‌ అండ్ కోపై అంత ప్రేమెందుకో!!
File
FILE
విజయవాడ ఎంపీ, సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్‌కు అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావుపై ప్రేమ పుట్టడానికి కారణం ఏమిటి. ఆయన ఒక్కసారి.. సమైక్యాంధ్ర స్వరాన్ని తగ్గించడంలో ఆంతర్యమేమిటి. తెలంగాణ ప్రజల పండుగల్లో ఒకటైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశ్యం. ఈ పండుగను పురస్కరించుకుని ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల నిధిని ఏకంగా కోటి రూపాయలకు పెంచాలని డిమాండ్ చేయడంలో మతలబు ఏంటన్నదానిపై రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు తలొగ్గిన యూపీఏ ప్రభుత్వం డిసెంబరు తొమ్మిదో తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై అర్థరాత్రి పూట ప్రకటన చేసింది. ఈ ప్రకటనలు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా తొలి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి, సీమాంధ్ర ప్రజల్లో హీరోగా నిలిచిన రాజకీయనేత లగడపాటి రాజగోపాల్. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అనారోగ్యం క్షీణించడంతో నాటకీయ సినీ ఫక్కీలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని ప్రభుత్వానికి, పోలీసులకు షాక్ ఇచ్చారు.

ఇలా.. ప్రత్యేక చర్యలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడునా అడ్డుపడిన వ్యక్తి లగడపాటి. అయితే, ఈ మధ్య కాలంలో కేసీఆర్‌పైనా అపారమైన ప్రేమను చూపిస్తున్నారు. తెరాస చేపట్టే వివిధ కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా, కేసీఆర్ కుమార్తె కుమార్తె కవిత నేతృత్వంలోని తెలంగాణ జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగే బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని గట్టిగా కోరుతున్నారు.

ఒకవైపున.. తెలంగాణ ఉద్యమకారులు సీమాంధ్ర నేతలపై విమర్శలు బాహాటంగా చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరుబాట కొనసాగిస్తున్నారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినోత్సవంగా జరుపుకోనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ విమోచనా దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేశారు. ఇలా.. ప్రజా వ్యతిరేక చర్యలు ఎన్ని చేస్తున్నప్పటికీ లగడపాటి మాత్రం నోరు మెదపడం లేదు.

గతంలో తెరాస నేతలు చేసే ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందించే ఆయన.. ఇపుడు వారికి వంత పాటపాడటం వెనుక ఉద్దేశ్యం ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ముఖ్యంగా, లగడపాటి ఉన్న వ్యాపారన్నీ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ వ్యాపారాలకు ఏమాత్రం విఘాత కలుగకుండా ఉండేందుకే కేసీఆర్‌కు లగడపాటి వంతపాడుతున్నట్టు సమాచారం. ఎంతైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు కదా!!

Share this Story:

Follow Webdunia telugu