భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై 25 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేసాడు. దీనితో ఆమె అనారోగ్యం బారిన పడింది. భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వారావు పేటకు చెందిన కామాంధుడు బాలికపై అఘాయిత్యం చేసినట్లు తేలింది.
గత కొన్నిరోజులుగా బాలిక ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు టెస్ట్ చేయించారు. ఈ పరీక్షలో ఆమె 5 నెలల గర్భవతిగా తేలింది. దీనితో విషయాన్ని చైల్డ్ డెవలెప్మెంట్ శాఖకు తెలియజేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.