పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

ఠాగూర్
ఆదివారం, 16 నవంబరు 2025 (18:05 IST)
పెళ్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మరో గంటలో వివాహం జరగాల్సివుండగా, వధువును వరుడు హత్య చేసాడు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివాహ ముహూర్తపు చీర కట్టుకునే విషయంలో వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన వరుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సాజన్ బరయ్య అనే యువకుడు సోని రాథోడ్ అనే యువతితో ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. శనివారం రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉంది. 
 
వివాహానికి గంట ముందు పెళ్లి చీర, డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాజన్ సోనిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అనంతరం ఆమె తలను గోడకేసి బలంగా కొట్టడంతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
దీంతో భయాందోళనకు గురైన నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అప్పటివరకు ఎంతో సంతోషంగా కనిపించిన పెళ్లింట విషాద చాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments