Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు యువతి హత్య.. అప్పుగా ఇచ్చిన డబ్బును అడిగినందుకు చంపేశాడు..

Advertiesment
Nikitha Godishala

సెల్వి

, బుధవారం, 7 జనవరి 2026 (15:47 IST)
Nikitha Godishala
అమెరికా మేరీల్యాండ్‌లోని ఎలికాట్ సిటీలో నిఖిత గొడిశాల అనే మహిళను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ హత్య చేశాడు. అనంతరం భారత్‌కు పారిపోయి వచ్చేశాడు. అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డ్ కేసుల కింద అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఇండియాకు పారిపోయిన అర్జున్‌ను గుర్తించేందుకు ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఇంటర్‌పోల్ పోలీసులు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు.
 
ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ తెలుగు యువతి నిఖిత హత్య కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్పుగా ఇచ్చిన 1000 డాలర్లు తిరిగి అడిగిందని ఆమెను అర్జున్ హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అర్జున్ శర్మకు 4,500 డాలర్లు నిఖిత అప్పుగా ఇచ్చిందని తేలింది. అయితే కొంతకాలం తర్వాత 3,500 డాలర్లు తిరిగి ఇవ్వగా.. మిగిలిన 1,000 డాలర్ల కోసం నిఖిత తిరిగి అడిగినప్పుడు వివాదం చెలరేగడంతో ఆమెను అర్జున్ హత్య చేసినట్లు సమాచారం. అనంతరం అదే రోజు భారతదేశానికి అర్జున్ శర్మ పారిపోయి వచ్చేశాడని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ - బీజేపీ పొత్తు .. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం..