Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకంటే వాడే తియ్యగున్నాడా? ప్రియుడి ముందే భార్యను కత్తితో పొడిచిన భర్త

Advertiesment
Crime
తెలంగాణలోని జహీరాబాద్ లో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి కోసం భర్తను వదిలేసి వెళ్లిపోయిన భార్యను కత్తితో పొడిచి చంపేసాడు కట్టుకున్న భర్త. భార్య ప్రియుడి ముందే నాకంటే వీడే తియ్యగున్నాడా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్య గొంతులో కత్తిని దించాడు. గొంతు కోసి హత్య చేసాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఝరాసంగం మండలం తుమ్మనపల్లికి చెందిన 35 ఏళ్ల సిద్ధారెడ్డి, 29 ఏళ్ల కవిత దంపతులు. సిద్ధారెడ్డి పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తుండగా అతడి భార్య కవిత టైలరుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో కవితకు తిరుపతి మండలం చంద్రగిరికి చెందిన పవన్ కుమార్ రెడ్డితో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది.
 
ఈ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడిపోయిన కవిత తన తొమ్మిదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడిని, భర్తను వదిలేసి అతడి దగ్గరకు వెళ్లిపోయింది. మార్చి 27 అర్థరాత్రి వేళ తన భార్య కనిపించపోయేసరికి ఆందోళన చెందిన సిద్ధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా ప్రియుడితో ఆమె జడ్చర్లలో వున్నట్లు తేలింది. దీనితో ఆదివారం నాడు సిద్ధారెడ్డి ఆమెను తనతో తీసుకుని వచ్చేందుకు కానిస్టేబులును తీసుకుని కారులో వెళ్లాడు.
 
జడ్చర్లలో కవితను కనుగొన్న పిదప ఆమె ప్రియుడిని జడ్చర్ల పోలీసు స్టేషనులో కౌన్సిలింగ్ ఇచ్చారు. కవితను భర్తతో వెళ్లమని పోలీసులు చెప్పగా ఆమె అందుకు నిరాకరించడమే కాకుండా భర్తను దుర్భాషలాడింది. అంతలో తను టీ తాగి వస్తానని చెప్పి బైటకు వెళ్లిన సిద్ధారెడ్డి అక్కడే షాపులో కత్తిని కొన్నాడు. మరోవైపు ప్రియుడిని వదిలి తను రానంటే రానని కవిత భీష్మించడంతో అతడిని కూడా వెంటబెట్టుకుని జహీరాబాదుకి బైలుదేరారు. వెనక సీట్లో కూర్చున్న భార్యాభర్తలు కవిత, సిద్దారెడ్డి ఒకరికొకరు వాగ్వాదం చేసుకుంటున్నారు.
 
ఇది గమనించిన కానిస్టేబుల్ వారిద్దరి మధ్య తను కూర్చుంటానని చెప్పగా అందుకు కవిత ఒప్పుకోలేదు. ఈ క్రమంలో మరికొద్దిసేపట్లే జహీరాబాద్ చేరుకుంటామని అనుకుంటుండగా సిద్ధారెడ్డి తీవ్ర ఆగ్రహంతో... నాకంటే వాడే తియ్యగున్నాడా నీకు అంటూ భార్య కవిత గొంతులో కత్తిని దించాడు. ఆ తర్వాత మెడపై పొడిచాడు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ కారును జహీరాబాదు ఆసుపత్రికి తరిలించాలని కోరాడు. ఆసుపత్రికి వెళ్లేలోపే ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సిద్ధారెడ్డిని అరెస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ-తెలంగాణలకు వర్ష సూచన.. ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులు