Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫస్ట్ నైట్ రోజున భార్యకు మత్తు మందు ఇచ్చి నలుగురు స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

Advertiesment
couple
హైదరాబాదు కూకట్ పల్లి పరిధిలో దారుణం జరిగింది. తనను ప్రేమించాను అని నమ్మించిన ఓ వ్యక్తి తనను పూర్తిగా మోసం చేయడమే కాకుండా అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ మీడియా ముందు వెల్లడించింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది.
 
నవాజ్ అనే యువకుడు తనకు ఓ షాపు కావాలంటూ నన్ను సంప్రదించాడు. షాపు అద్దెకి ఇచ్చిన తర్వాత నుంచి అతడు నాతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరుతో నన్ను అనుసరించాడు. ప్రేమిస్తున్నానంటూ నా వెంటబడ్డాడు. అతడు నిజాయితీగా వున్నాడనుకుని అతడి ప్రేమను అంగీకరించా. నా పేరును నవదుర్గ అని పేరు మార్చి జూన్ 2025లో వివాహం చేసుకున్నాడు.
 
ఫస్ట్ నైట్ రోజున కూల్ డ్రింకులో మత్తుమందు కలిపాడు. అది తెలియకుండా నేను తాగేసాను. ఆ తర్వాత అతడు నలుగురు స్నేహితులు కలిసి నాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. నా పేరుపై వున్న ఫ్లాటు, బంగారంపై లోన్లు తీసుకుని పారిపోయాడు. అతడి గురించి మరింత విచారిస్తే అతడు నన్ను మూడో వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్నానంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించింది. తనకు న్యాయం చేయాలంటూ విన్నవించుకున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకవైపు ఎండలు.. మరోవైపు పిడుగులు.. అలెర్ట్