కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (12:54 IST)
తన భార్యకు గతంలోనే వివాహమైందన్న విషయాన్ని తెలుసుకున్న ఓ భర్త బలవన్మరణానికి పాల్డ్డాడు. తనకు పెళ్లయిందన్న విషయాన్ని భార్య కొన్ని సంవత్సరాల పాటు దాచిపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నిజం తెలుసుకున్న భర్త... భార్య చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగుళూరు పరిధిలోని నగరభావి అనే ఏరియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరభావి, చంద్ర లే ఔట్‌ 2 స్టేజ్‌కు చెందిన వినయ్ పి (41) అనే వ్యక్తి సివిల్ కాంట్రాక్టరుగా పని చేస్తున్నాడు. ఈయనకు మ్యాట్రిమోనియల్ ద్వారా సంధ్య మహిళతో గత 2017లో వివాహం చేసుకోగా, గత 2018లో కమార్తె జన్మించింది. ఈ వివాహాన్ని కూడా ఎంతో గ్రాండ్‌‌గా ఐదు నక్షత్ర హోటల్లో నిర్వహించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యకు గతంలోనే వివాహమైనట్టు వినయ్ తెలుసుకుని కుమిలిపోయాడు. 
 
తన వైవాహిక జీవితంలో ఎదురైన తీవ్ర ఒత్తిడిని అధిగమించేందుకు మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత వైవాహిక బంధాన్ని చక్కదిద్దుకునేందుకు వినయ్ ప్రయత్నించినప్పటికీ భార్య ఏమాత్రం సహకరించలేదు. ఆమె మోడలింగ్, యాక్టింగ్ కెరీర్‌లో స్థిరపడేందుకు విడాకులు కావాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం. వీటిని భరించలేని వినయ్.. హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వినయ్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments