పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

ఐవీఆర్
మంగళవారం, 11 నవంబరు 2025 (17:53 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఈమధ్య కాలంలో పెళ్లి చేసుకున్న జంటలు పట్టుమని 10 నెలలు కూడా గడవకముందే కీచులాటలో లేదంటే ఒకరిపై ఒకరు అనుమానాలు... ఇత్యాది కారణాలతో తమ కాపురాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోని గిరినగర్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఎనిమిది నెలల క్రితం గగన్ అనే బ్యాంకు ఉద్యోగితో మేఘనకు వివాహం అయ్యింది. మేఘన-గగన్ పెళ్లి నిశ్చితార్థం అయిన దగ్గర్నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ప్రీ-వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నారు. వాటిని తమ సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసుకున్నారు.
 
అలా ఎంతో సందడి సందడిగా గడిపిన వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక ఇద్దరూ బెంగళూరు లోని గిరినగర్ లో కాపురం పెట్టారు. పెళ్లైన కొద్దిరోజులు ఇద్దరూ ఒకరంటే ఒకరు విడిచిపెట్టలేనంతగా వున్నారు. ఐతే రెండుమూడు నెలలు గడవగానే ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు తలెత్తడం ప్రారంభమైంది. చిన్న తగాదాకే మేఘన భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఐతే ఆమె తల్లిదండ్రులు ఎలాగోలా ఒప్పించి తిరిగి గగన్ వద్ద విడిచిపెట్టి వెళ్లారు. ఐతే ఈ గ్యాపులో గగన్ మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడంటూ మేఘన ఆరోపించింది. తనను భార్య అలా అనుమానించేసరికి ఓర్చుకోలేని గగన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోడలు మేఘన వేధింపుల వల్లనే తన కొడుకు ప్రాణాలు తీసుకున్నాడంటూ గగన్ తల్లిదండ్రులు ఆమెపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

ఒకే వేదికపై ఎంగేజ్‌మెంట్ తర్వాత ర‌ష్మిక- విజ‌య్ కనిపించబోతున్నారట..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments