గ్రామ సర్పించి అక్రమ సంబంధం... పోలీసులకు పట్టించిన భర్త

ఠాగూర్
ఆదివారం, 3 ఆగస్టు 2025 (09:51 IST)
శ్రీకాకుళం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామ సర్పించి అక్రమ సంబంధాన్ని ఓ వ్యక్తి బహిర్గతం చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళతో విజయనగరంలోని ఒక లాడ్జిలో ఉండగా ఆమె భర్త వీరిద్దరినీ పట్టుకొని ఒకటో పట్టణ పోలీసులకు శనివారం అప్పగించాడు. సదరు సర్పంచిని భర్త తరపు బంధువులు దేహశుద్ధి చేశారు. 
 
సర్పంచి గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకుడిగా కీలక పాత్ర పోషించి చివరి సమయంలో జనసేనలో చేరాడు. ఓ మాజీ మంత్రి సోదరుడికి ప్రధాన అనుచరుడిగా తిరిగేవాడు. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు డెంకాడ మండలానికి చెందిన వ్యక్తితో 16 ఏళ్ల కిందట ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సదరు మహిళను సర్పంచి మళ్లీ వివాహం చేసుకున్నట్లు సమాచారం. 
 
ఎవరు ఎవరితోనైనా తిరగొచ్చని, చట్టంలో అలాగే ఉందని.. కేసు పెట్టలేమని పోలీసులు పంపించేశారని సంబంధిత మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ఒకటో పట్టణ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరిని వివరణ కోరగా.. విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ చేసి పంపించేశామన్నారు. కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments