సచిన్-గంగూలీ సేనల మధ్య ఐపీఎల్ సమరం నేడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంగ్రామంలో సోమవారం సచిన్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్- సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ సారథ్యం వహించే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరుగనుంది. ముంబైలో జరుగనున్న 17వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ధీటుగా రాణించే అవకాశం ఉంది. ఇంకా గంగూలీ కెప్టెన్సీ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా గట్టి పోటీని ప్రదర్శించాలని భావిస్తోంది.ఇప్పటికే శనివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ సేనపై మెరుగ్గా ఆడి హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకోవాలని కేకేఆర్ భావిస్తోంది.
అదే విధంగా శనివారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి పరాజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూర్ ఏడు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ మూడో సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సచిన్ సేన గట్టిపోటీని ప్రదర్శిస్తుందని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.