కరాచీలో శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై రికార్డులు బద్దలైనా డ్రాగా ముగియడం గమనార్హం. ఇరు జట్ల బ్యాట్సమెన్‌లు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం వహించారు.
అంతకుముందు, 765 పరుగులు వద్ద తన రెండో ఇన్నింగ్స్‌ను పాక్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఐదు వికెట్లకు 144 పరుగులు చేసింది. నాలుగో రోజే డ్రాగా ఈ మ్యాచ్ ముగుస్తుందని అంచనా వేయడంతో అందరూ పాక్ కెప్టెన్ యూనిస్ ఖాన్‌పై దృష్టి నిలిచింది.
మైదానంలో పాతుకుపోయిన ఈ యువ సారథి... లారా 400 పరుగుల రికార్డ్‌ను అధిగమిస్తాడని అంచనాలు చేశారు. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ యూనిస్ ఇన్నింగ్స్‌కు 313 పరుగుల వద్ద తెరపడింది.