వెల్లింగ్టన్ టెస్టు: ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పకున్న కివీస్!
న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. తొలి టెస్టు నాలుగో రోజైన సోమవారం ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో 369 పరుగులు సాధించింది. దీంతో ఆస్ట్రేలియాపై 67 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 187
/5 స్కోరుతో సోమవారం న్యూజిలాండ్ ఆటను ప్రారంభించింది. కానీ వర్షం కారణంగా కివీస్ 52 ఓవర్ల వరకే ఆడాల్సి వచ్చింది. మెక్‌కల్లమ్, వెటోరీల భాగస్వామ్యంతో 183/5 వద్దనున్న కివీస్ స్కోరు 309 పరుగులుగా పెరిగింది. వెటోరీ 119 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 77 పరుగులు సాధించాడు. మెక్‌కల్లమ్-వెటోరీలు తమ భాగస్వామ్యంతో ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. కానీ 77 పరుగుల వద్ద వెటోరీ హారిడ్జ్ బంతిలో బౌల్డ్ కావడంతో క్రీజులోకి దిగిన టఫీ మెక్‌కల్లమ్‌కు గట్టి భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో మెక్‌కల్లమ్ (11 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 94 పరుగులు), టఫీ (రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23 పరుగులు)లు క్రీజులో ఉన్నారు. మరోవైపు.. సోమవారం న్యూజిలాండ్ ఆటకు వరుణదేవుడు అంతరాయం కలిగించాడు. ఒకవేళ మంగళవారం కూడా వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగితే 30 ఓవర్ల వరకే మ్యాచ్ జరుగుతుంది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. ఇకపోతే.. ఆస్ట్రేలియా బౌలర్లలో హారిడ్జ్ మూడు వికెట్లు సాధించగా, బోలింగర్ రెండు, రియాన్ హారిస్ ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.