బౌలర్లపై పంజాబ్ కెప్టెన్ సంగక్కర ప్రశంసల వర్షం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సూపర్ ఓవర్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయానికి కీలక పాత్ర పోషించిన బౌలర్లపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంకా పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా కూడా తమ జట్టు క్రికెటర్లను కొనియాడారు. సూపర్ ఓవర్‌తో పాటు మ్యాచ్ మొత్తానికి బౌలర్లు ధీటుగా రాణించారని సంగక్కర కితాబిచ్చాడు.జువాన్ థెరాన్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీవాత్సవలు మైదానంలో ప్రదర్శించిన ఆటతీరును భేష్ అని కెప్టెన్ కొనియాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ పరుగుల యంత్రం మాథ్యూ హెడెన్‌ను అవుట్ చేయటంతో తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం కలిగిందని సంగక్కర అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లను తమ జట్టు బౌలర్లు ఆటాడుకున్నారని కెప్టెన్ తెలిపాడు.