Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ ట్వంటీ-20 కెప్టెన్‌గా షాహిద్ ఆఫ్రిది ఎంపిక!

Advertiesment
పాకిస్థాన్
, బుధవారం, 24 మార్చి 2010 (12:32 IST)
ప్రపంచ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో పాల్గొనే పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంపికలో ఉన్న సందిగ్ధతకు ఆ దేశ క్రికెట్ బోర్డు తెరదించింది. ట్వంటీ-20 పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా షాహిద్ ఆఫ్రిదిని ఎంపిక చేసింది. కాగా, ఈ మెగా టోర్నమెంట్ వచ్చే నెలలో కరేబియన్ దీవుల్లో ప్రారంభంకానుంది.

గత యేడాది ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన ట్వంటీ-20 క్రికెట్ టోర్నీకి పాక్ జట్టు కెప్టెన్‌గా ఆఫ్రిది నాయకత్వం వహించిన విషయం తెల్సిందే. తన ఎంపికపై ఆఫ్రిది స్పందిస్తూ.. ఇది నాకు ఒక ఛాలెంజ్. అందుకే అంగీకరించాను. తమ వద్ద ట్వంటీ-20 టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో కరేబియన్ గడ్డపై అడుగుపెడతామన్నారు.

ఇటీవల ఉద్దేశ్యపూర్వకంగా బాల్ టాంపరింగ్‌కు పాల్పడినందుకు ఆఫ్రిదిపై క్రమశిక్షణ చర్య తీసుకున్న విషయం తెల్సిందే. ఆఫ్రిదిపై రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లపై నిషేధాన్ని ఐసీసీ విధించింది. ఆ తర్వాత పాక్ క్రికెట్ బోర్డు మూడు మిలియన్ల్ అపరాధం కూడా విధించింది.

Share this Story:

Follow Webdunia telugu