గంగూలీ సేనపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సచిన్ టెండూల్కర్ సేన విజయభేరి మోగించింది. బెంగాల్ దాదా, సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (71 నాటౌట్: 48 బంతుల్లో 10 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ మూడో సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకొంది.తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. కేకేఆర్ ఆటగాళ్లలో క్రిస్‌గేల్ (75: 60 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ సౌరవ్ గంగూలీ (34 బంతుల్లో 31; 5 ఫోర్లు), ఒవైఎస్‌షా (31)లు జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ సచిన్ సూపర్ ఇన్నింగ్స్‌తో మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఇకపోతే.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు, మురళీ కార్తీక్ ఒక్క వికెట్‌ను పడగొట్టారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లలో జహీర్ ఖాన్ రెండు వికెట్లు సాధించగా, హర్భజన్ సింగ్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.