ఇంగ్లండ్ కౌంటీ జట్టులో యువరాజ్ సింగ్‌కు నో ఛాన్స్..!
ఇంగ్లండ్ దేశవాళీ ట్వంటీ-20 సిరీస్‌లో ఆడేందుకుగాను మిడిల్‌సెక్స్ జట్టు కోసం టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి యువరాజ్ సింగ్‌కు అనుమతి లభించకపోవడంతో యువీ పేరును మిడిల్‌సెక్స్ జట్టులో చేర్చుకూడదని ఆ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే మిడిల్‌సెక్స్ జట్టులో చేరేందుకుగాను యువరాజ్ సింగ్ సంతకాలు చేసిన ఒప్పంద పత్రాలు తమకు సకాలంలో అందాయి. కానీ బీసీసీఐ అనుమతి లభించకపోవడంతో యువీని ఎంపిక చేయడానికి వీలు కాలేదని మిడిల్‌సెక్స్ జట్టు స్పష్టం చేసింది.అయితే ట్వంటీ-20 వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక విదేశీ పర్యటనలను దృష్టిలో పెట్టుకుని యువీకి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఇంకా గాయాలతో సతమతమవుతున్న యువరాజ్ పరిమిత ఓవర్ల ట్వంటీ-20 వరల్డ్ కప్‌లోపు కోలుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం యువరాజ్ సింగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మిడిల్‌సెక్స్ జట్టుతో డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్, స్టార్ ఆటగాడు గిల్‌క్రిస్ట్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.