Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్చలకు అవకాశం ఇవ్వండి... వెస్టిండీస్ వేడుకోలు...!

చర్చలకు అవకాశం ఇవ్వండి... వెస్టిండీస్ వేడుకోలు...!
, గురువారం, 29 జనవరి 2015 (10:09 IST)
భారత టూర్ నుంచి వెస్టిండీస్ జట్టు మధ్యలోనే స్వదేశానికి తిరుగుముఖం పట్టడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును భారత బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.
 
దీంతో తమను కోర్టుకీడ్చవద్దంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐని వేడుకుంటోంది. ఈ సందర్భంగా విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్ మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం తమకు రెండు నెలలు సమయం ఇవ్వాలని కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తెలిపారు. తాము ఇంతకుముందు రాసిన లేఖలను, అందులో పేర్కొన్న ప్రతిపాదనలను బీసీసీఐ సరిగా పరిశీలించలేదని డేవ్ కామెరాన్ వాపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu