Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జట్టు కోసం నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేయాలి : రిచర్డ్స్

జట్టు కోసం నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేయాలి : రిచర్డ్స్
, ఆదివారం, 25 జనవరి 2015 (12:30 IST)
భారత్ క్రికెట్ జట్టు అవసరాల దృష్ట్యా విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని విశ్వవిఖ్యాత క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ముక్కోణపు వన్డే సిరీసలో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లీ స్థానంపై అందోళన వ్యక్తమవుతోంది. అయితే జట్టు అవసరాల దృష్ట్యా విరాట్‌ అదే స్థానంలోనే బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. 
 
ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కోహ్లీ తీవ్రంగా నిరాశ పరిచాడు. నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్‌కు రావడం ఉత్తమ ఆటగాడికి సరైన స్థానం అనుకుంటున్నా. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై మొదటగా వచ్చే బ్యాట్స్‌మెన్‌ త్వరగా అవుటవుతారు. అటువంటి పరిస్థితుల్లో కోహ్లీ నాలుగో స్థానంలో ఆడాల్సివుంటుంది. ఎందుకంటే ఎలాంటి సమయంలోనైనా కోహ్లీ మ్యాచ్‌ పరిస్థితులను మార్చగలడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu