Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ద్రావిడ్ ఉన్నాడు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం: కోహ్లీ

ద్రావిడ్ ఉన్నాడు.. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం: కోహ్లీ
, మంగళవారం, 8 జులై 2014 (10:33 IST)
ఆనాటి సిరీస్‌లో పరుగుల వర్షం కురిపించిన బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు సలహాదారుగా తమ వెంట ఉన్నాడని, ఇక తమకు బ్యాటింగ్ సమస్యలు ఉండబోవని టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అన్నాడు. గత ఇంగ్లండ్ పర్యటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. 
 
2011లో ఎదురైన వైట్ వాష్‌కు ఈ సిరీస్ ద్వారా సమాధానం చెబుతామని స్పష్టం చేశాడు. ఇక, ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న కోహ్లీ తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, సుప్రసిద్ధ లార్డ్స్‌లో టెస్టు ఆడనుండడం ఉద్విగ్నతకు గురిచేస్తోందని చెప్పాడు. వ్యక్తిగతంగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నానని, వాటి సాధనపై దృష్టి పెట్టానని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu