Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క శర్మతో లవ్ ఎఫెక్ట్‌.. కోహ్లీ ఆటపై ఉండదు!: కోచ్

అనుష్క శర్మతో లవ్ ఎఫెక్ట్‌.. కోహ్లీ ఆటపై ఉండదు!: కోచ్
, శుక్రవారం, 25 జులై 2014 (15:06 IST)
బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమాయణం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. టీమిండియా ఇంగ్లండ్ టూర్‌ను పురస్కరించుకుని సీనియర్లంతా తమ వైఫ్స్‌తో ఇంగ్లండ్‌కు వెళ్తే.. యువ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బీసీసీఐ అనుమతితోనే తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను ఇంగ్లండ్‌కు వెంటబెట్టుకెళ్లాడని టాక్ వస్తోంది.
 
అంతేకాదు.. ఈ జంట వీలుదొరికినప్పుడల్లా రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తెగ తిరుగుతారు. ఇటీవల ఇంగ్లండుతో ఆడిన టెస్టు మ్యాచుల్లో కోహ్లీ ఆటతీరుపై పలు విమర్శలు వచ్చాయి. ప్రియురాలు అనుష్క మోజులో పడి మనవాడు ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నాడంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.
 
వాటిపై విరాట్ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అనుష్కతో రిలేషన్ ఎఫెక్ట్‌ కోహ్లీ ఆటపై ఉండబోదన్నారు. అతని ప్రాధాన్యతలేంటో అతనికి తెలుసునని, ఆటపైనే అతని దృష్టంతా ఉందని చెప్పాడు. ఇరవై ఐదేళ్ల కుర్రాడయిన విరాట్ ఏం చేస్తున్నాడో తనకు తెలుసునని, వ్యక్తిగత జీవితాన్ని మేనేజ్ చేసుకోగలడని ధీమా వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu