Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై స్కూల్ క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 6 వికెట్లు!

ముంబై స్కూల్ క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 6 వికెట్లు!
, శనివారం, 27 డిశెంబరు 2014 (11:49 IST)
ముంబై స్కూల్ క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డు నమోదైంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా ఎంతో మంది క్రికెటర్లు శిక్షణ పొందిన ముంబై‌లోని శివాజీ పార్క్ స్టేడియంలో ఓ చెత్త రికార్డు నమోదైంది.

ముంబై లోని స్కూల్స్ మధ్య అండర్-16 విభాగం ఫైనల్ మ్యాచ్‌లో ఒక టీం క్రికెట్ చరిత్రలో అత్యంత ఘోరంగా విఫలం కాగా, మరో టీం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. 
 
అంధేరీలోని రాజ్ హన్స్ విద్యాలయ, గోరేగాన్‌లోని యశోధామ్ హై స్కూల్ మధ్య పోటీ జరిగింది. యశోధామ్‌కు చెందిన గౌరంగ్ సచార్ 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 6 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్టు మిగతా వికెట్లను 4 పరుగులు చేసి కోల్పోయింది. రాజ్ హన్స్‌కు చెందిన 9 మంది ఆటగాళ్ళు ఎటువంటి పరుగులూ చేయకుండా పెవిలియన్ చేరారు.

Share this Story:

Follow Webdunia telugu